‘మనం’ తో కం బ్యాక్ ఇచ్చిన నాగార్జున కొంత గ్యాప్ తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయన’ చేశారు. కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించారు.2016 వ సంవత్సరం జనవరి 15న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అప్పటికి పోటీగా ఎన్టీఆర్- సుకుమార్ ల ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’, శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది ఈ సినిమా.
Soggade Chinni Nayana Collections
నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ క్లోజింగ్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి :
‘సోగ్గాడే చిన్ని నాయన’ రూ.18.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ముగిసేసరికి ఏకంగా రూ.47.47 కోట్ల షేర్ ను సాధించి ఫైనల్ గా బయ్యర్లకి రూ.28.97 కోట్ల భారీ లాభాలను అందించింది ఈ సినిమా.