మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 2019 ఏండింగ్ లో ప్రతిరోజు పండగే సినిమాతో మంచి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక 2020లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో దాదాపు అదే సీజన్ లో వచ్చి మరో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే గత సినిమా రేంజ్ లో మాత్రం సోలో బ్రతుకు.. పెద్దగా లాభాలను అంధించలేదు. పెట్టిన పెట్టుబడికి మంచి లాభమే వచ్చింది. వరల్డ్ వైడ్ గా సోలో బ్రతుకే సో బెటర్ 21.25కోట్ల రూపాయల గ్రాస్ కెలెక్షన్స్ ను అందుకున్నట్లు తెలుస్తోంది.
కేవలం 50% కెపాసిటీతో థియేటర్స్ నడిచినప్పటికి ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయి అంటే గొప్ప విషయమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 11.68కోట్ల షేర్స్ ను అంధించాయి. కేవలం 9కోట్లు వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యేది. వరల్డ్ వైడ్ షేర్స్ 12.61కోట్లు కాగా వచ్చిన టోటల్ ప్రాఫిట్స్ రూ.3.01కోట్లని తెలుస్తోంది. కరోనా కష్ట కాలంలో ఈ స్థాయిలో లాభాలు రావడం అంటే చాలా గ్రేట్.
ఏదేమైనా ఈ సినిమా లాక్ డౌన్ తరువాత అందరికంటే ముందే ధైర్యంగా ముందడుగు వేసి భవిష్యత్తు సినిమాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక సంక్రాంతికి రానున్న సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా చాలా స్పీడ్ గా లాభల్లోకి వచ్చేస్తాయని చెప్పవచ్చు.