Sreeleela: బాలీవుడ్‌కి వెళ్తున్న శ్రీలీల.. అక్కడకి సూట్ అవుతుందా? మళ్లీ వస్తుందా?
- August 15, 2024 / 06:56 PM ISTByFilmy Focus
కన్నడ నుండి టాలీవుడ్‌కి వచ్చిన తెలుగు అందం శ్రీలీల (Sreeleela) ఇప్పుడు ముంబయి ఫ్లయిట్ ఎక్కుతోందా? బాలీవుడ్‌లో తన కెరీర్ స్టార్ట్ చేయబోతోందా? ఈ ప్రశ్నలకు బాలీవుడ్ వర్గాల నుండి అవును అనే సమాధానాలే వస్తున్నాయి. దానికి కారణం ఓ యువ హీరో సినిమాలో ఆమెను తీసుకున్నారు అనే వార్తలు వస్తుండటమే. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ వార్త అధికారికంగా ప్రకటిస్తారని టాక్. శ్రీలీల తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ నాయికగా పేరు తెచ్చుకుంది.
Sreeleela

అగ్రహీరోలతో ఒకవైపు, కుర్ర కథానాయకులతో మరోవైపు వరుసగా సినిమాలు ఓకే చేసింది. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంది. ఆమె సినిమాలు సరైన విజయం అందుకోకపోవడంతో చిన్న గ్యాప్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఆమె చేతిలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) , నితిన్ (Nithin Kumar) ‘రాబిన్ హుడ్’ (Robinhood) , రవితేజ (Ravi Teja) ‘కోహినూర్’ (చర్చలో ఉన్న టైటిల్) ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ ప్రయాణం వార్తలు ఆసక్తికరంగా మారింది.

మన దగ్గర వరుస సినిమాలు ఉన్నప్పుడే బాలీవుడ్‌కి వెళ్లిన రష్మిక (Rashmika) అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తోంది. శ్రీలీల కూడా అలానే చేస్తుందా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక శ్రీలీల సినిమా సంగతి చూస్తే.. సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) ‘మిట్టి’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. యాక్షన్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాలో శ్రీలీలను తీసుకున్నారట. దర్శకుడు బల్వీందర్ సింగ్ ఇప్పటికే శ్రీలకు స్క్రిప్ట్ వినిపించారట.

అక్టోబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని టాక్. ఇక సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ సినిమా ‘దిలేర్’లోనూ శ్రీలీల కథానాయిక అని సమాచారం. అయితే ఈ రెండు సినిమాలూ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఈ అనౌన్స్‌మెంట్‌లు ఉంటాయి అంటున్నారు. దీంతో శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ వెళ్తే తిరిగి వస్తుందా అనే చర్చా ఉంది. ఎందుకంటే ఇలాంటి నాయికలకు అక్కడ మంచి ఆదరణ దక్కుతుంది.













