బిగ్ బాస్ హౌస్ లో బాటిల్ ఆఫ్ సర్వైవల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా బ్లాక్ గ్లౌజ్ వచ్చినవాళ్లకి మంచి బెనిఫిట్ ఉండబోతోంది. ఈ టాస్క్ లో రాజ్ సేఫ్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. మొదటి రౌండ్లో ఇనయ టీమ్ గెలిచింది. అలాగే, రెండో రౌండ్ లో శ్రీసత్య టీమ్ బాగా పోరాడినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా శ్రీసత్య టీమ్ ఓడిపోయింది. ముఖ్యంగా ఆదిరెడ్డి, రేవంత్, ఇద్దరూ కూడా పూలు, బొమ్మలని ఎక్కువగా కలక్ట్ చేశారు. వీరి వల్ల రెడ్ టీమ్ కి ఎక్కువగా పాయింట్స్ వచ్చాయి.
బ్లూ టీమ్ లో ఉన్న శ్రీసత్య రేవంత్ ని రెచ్చగొడుతునే ఉంది. ఈటాస్క్ ఆడుతున్నంత సేపు తను అన్న మాటలని పదే పదే చెప్తూ ట్రిగ్గర్ చేసింది. నామినేషన్స్ అప్పటి నుంచీ ఇద్దరి మద్యలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఫస్ట్ నుంచీ ఫ్రెండ్ గా ఉంటూనే రేవంత్ గేమ్ కి ఎగైనిస్ట్ అయ్యింది. టాస్క్ లో వీరిద్దరి లొల్లి పీక్స్ కి వెళ్లిపోయింది. ఓడిపోయిన టీమ్ నుంచీ బిగ్ బాస్ ఒకరిని ఏకాభిప్రాయంతో ఎంచుకుని నేరుగా వచ్చేవారం నామినేట్ అవ్వమని చెప్పాడు. దీంతో శ్రీసత్య నామినేట్ అయినట్లుగా సమాచారం.
ఈ టాస్క్ లో ఓడిపోయిన వారు వచ్చేవారం నామినేట్ అవుతారని ముందుగానే చెప్పాడు బిగ్ బాస్. అలాగే, ఇప్పటికే రోహిత్ కూడా నామినేట్ అయిన ఉన్నాడు కాబట్టి వీరిద్దరూ వచ్చేవారం నేరుగా నామినేట్ అయిన వ్యక్తులు. ఇక హౌస్ లో శ్రీసత్య కావాలనే బెల్డ్ దగ్గర గొడవ పెట్టుకుందా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదో రకంగా హౌస్ లో హైలెట్ అవ్వడానికే చూస్తోందని అంటున్నారు. అందుకే ఈ టాస్క్ లో ఆర్గ్యూమెంట్స్ పెట్టుకుని ఆటలో ఫోకస్ తప్పించాలని చూసిందని చెప్తున్నారు.
శ్రీసత్య ఆటలో ట్విస్ట్ ఇద్దామని అనుకుందని కానీ అది బెడిసికొట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ లో రాజ్ సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈవారం నామినేషన్స్ లో 13మంది ఉన్నారు. ఇందులో రాజ్ డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. మరి ఇప్పుడు రాజ్ సేఫ్ అయితే, కీర్తి ఇంకా ఇనయ , వాసంతీ ముగ్గురూ డేంజర్ లో పడతారు. ఈవారం దీపావళి ప్రత్యేకమైన ఎపిసోడ్ కాబట్టి, ఎవర్ని ఎలిమినేట్ చేస్తారు అనేది ఆసక్తకరంగా మారింది. అదీ మేటర్.