బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ రద్దు అయిన తర్వాత హౌస్ లో ఆహారం మొత్తాన్ని దొంగలు వచ్చి ఎత్తుకుపోయారు. దీంతో ఫుడ్ కోసం హౌస్ మేట్స్ ఫైట్ చేయాల్సి వస్తోంది. రెండు టీమ్స్ కి రెండుసార్లు మాత్రమే ఫుడ్ దొరికింది. ఇక మార్నింగ్ ఎప్పుడూ కూడా హుషారైన పాటతో నిద్రలేపే బిగ్ బాస్ కుక్కల అరుపులతో నిద్ర లేపాడు. హౌస్ మేట్స్ నిద్రలేస్తూనే ఆకలితో అలమటించిపోయారు. దీంతో హౌస్ లో ఆహారాన్ని పొందాలి అంటే, హౌస్ మేట్స్ అందరూ ఎవరికి వారు ప్రతిజ్ణ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
ఈ ప్లెడ్జ్ చేసిన తర్వాత స్టోర్ రూమ్ ద్వారా రేషన్ పంపించాడు బిగ్ బాస్. అంతేకాదు, ఈవారం హౌస్ మేట్స్ కి బాటిల్ ఫర్ సర్వైవల్ అనే టాస్క్ ఇచ్చాడు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ లో ఉన్న రెండు టీమ్స్ రెడ్ టీమ్ గా, బ్లూ టీమ్ గా విడిపోయాయి. రేవంత్, పైమా, బాలాదిత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, కీర్తి రెడ్ టీమ్ కాగా, మిగిలిన వాళ్లు అందరూ బ్లూ టీమ్ గా విడిపోయారు. బిగ్ బాస్ ఏర్పాటు చేసిన బెల్ట్ ద్వారా బొమ్మలు, పూలు హౌస్ లోకి వస్తాయి.
దీన్ని తీసుకుని ఎవరి టీమ్ దగ్గర ఏర్పాటు చేసిన బాస్కెట్ లో బొమ్మలని అలాగే, మట్టికుండీలో పూలని వేసి వాటిని కాపాడుకోవాల్సి ఉంటుంది. దీంతో హౌస్ మేట్స్ మద్య పెద్ద పెద్ద గొడవలే అయ్యాయి. ముఖ్యంగా శ్రీహాన్ కి శ్రీసత్యకి గట్టిగా పడింది. అలాగే, టాస్క్ లో రేవంత్ ని ఏదో ఒక విషయంలో శ్రీసత్య రెచ్చగొడుతునే ఉంది. ఇక రేవంత్ – శ్రీసత్య ఇద్దరూ కూడా మాటకి మాట అనుకున్నారు. తోసి పాడ దొబ్బేయ్ అన్న మాటని పట్టుకుని పదే పదే రేవంత్ ని రెచ్చగొట్టింది శ్రీసత్య.
దీంతో శ్రీసత్యని ఇమిటేట్ చేస్తూ రేవంత్ వెటకారం చేశాడు. ఇదే పాయింట్ పట్టుకుని అర్జున్ శ్రీసత్యని రేవంత్ ని నామినేట్ చేయమని సలహా ఇచ్చాడు. లాస్ట్ వీక్ మెరీనా వెక్కిరించిందని నామినేట్ చేశాడు కదా, మరి ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేయమని చెప్పాడు. దీంతో శ్రీసత్య మనం నామినేట్ చేసినా వేస్ట్ అని, టాప్ 5లోకి వెళ్లిపోతాడని, బయట జనాలు సేవ్ చేసేస్తారని జోస్యం చెప్పింది. అంతేకాదు, మెరీనా విన్నర్ అవుతాడని అంటే, అతను విన్నర్ అని ఫిక్స్ అయిపోతే మనం ఆడి కూడా వేస్ట్ అన్నట్లుగా మాట్లాడింది.
ఫస్ట్ లెవల్లో శ్రీసత్య టీమ్ ఓడిపోయింది. రెండో లెవల్లో కూడా హౌస్ మేట్స్ పూలకోసం, బొమ్మలకోసం కొట్టుకునేంత పని చేశారు. ఒకరినొకరు తోసుకుంటూ, కొట్టుకుంటూ, గిచ్చుకుంటూ గేమ్ ఆడారు. బయట పూలని కాపాడుతున్న శ్రీసత్య మన టీమ్ ఎవ్వరూ కూడా ఫిజికల్ అవ్వొద్దని మొత్తుకున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతేకాదు, టీమ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్లు వచ్చేవారం నేరుగా నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ ముందుగానే హెచ్చరించాడు. అదీ మేటర్.