ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం రాజమౌళి కి ఉన్నంత బ్రాండ్ వేల్యూ, ఆయన సినిమాలకు ఉన్నటువంటి మార్కెట్ రేంజ్ ఏ డైరెక్టర్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన అద్భుతమైన విజన్ తో బాహుబలి సిరీస్ లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించి తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ని ఎవ్వరూ అందుకోలేనంత స్థాయికి తీసుకెళ్లాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రం తో అయితే పాన్ వరల్డ్ మార్కెట్ ని కూడా ఓపెన్ చేసి, ఆస్కార్ అవార్డు ని కూడా మన తెలుగు సినిమాకి తెచ్చిపెట్టాడు.
అయితే రాజమౌళి కి ఇదేమి ఊరికే రాలేదు. ఎంతో శ్రమ కష్టం తో పాటుగా, డబ్బు ఖర్చు కూడా ఉంది. బాహుబలి రెండు భాగాలను తియ్యడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో రీసెంట్ గా ఆ చిత్రం లో పని చేసిన దగ్గుపాటి రానా చెప్పుకొచ్చాడు. ఒక ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ నుండి రాజమౌళి బాహుబలి రెండు పార్టులు పూర్తి చెయ్యడం కోసం 400 కోట్ల రూపాయిలు అప్పు తీసుకున్నాడట. దానికి వడ్డీ 24 శాతం, అంటే నెలకి 96 కోట్ల రూపాయిలు కట్టేవాడట.
బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులను ఇచ్చేసి అప్పు వదిలించుకున్నాడట.అంత డబ్బు అప్పు చేసి రిస్క్ చేసి సినిమా తీసాడంటే రాజమౌళి కమిట్మెంట్, మరియు తానూ తీస్తున్న కథ మీద ఎంత నమ్మకం ఉంటె అలా చేసాడో అర్థం చేసుకోవచ్చు. అలా ఆయన రిస్క్ చెయ్యబట్టే ఈరోజు మన తెలుగు సినిమా స్థాయి ఈ రేంజ్ లో ఉంది.
అయితే రాజమౌళి కి అంత అప్పు ఇచ్చింది మరెవరో కాదు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అట. వీళ్లకు సొంతగా వందల కోట్లు బిజినెస్ ఇచ్చే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా ఉంది. అందుకే అడగగానే అంత అప్పు ఇచ్చాడని అంటున్నారు ట్రేడ్ పండితులు.