‘ఆర్.ఆర్.ఆర్’..(RRR) టాలీవుడ్లో చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన బడా మల్టీస్టారర్ మూవీ. రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవిదేశాల్లో కూడా ఘన విజయం సాధించింది. రూ.1200 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్ (Jr. NTR), రాంచరణ్ (Ram Charan) ..లు ‘నాటు నాటు’ అంటూ వేసిన స్టెప్పులకి ఆస్కార్ అవార్డు సైతం వెతుక్కుంటూ వచ్చింది. ఏదేమైనా ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో అందరూ గర్వపడాల్సిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ సక్సెస్ క్రెడిట్లో అందరికీ భాగం ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ లో ‘ఎన్టీఆర్ పాత్రని తక్కువ చేసి చూపించారనే’ డిస్కషన్ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి రిలీజ్ టైంలో ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయం పై స్పందించడం జరిగింది. ” ‘కొమరం భీముడొ’ సాంగ్ తర్వాత సినిమాని ఎండ్ చేసి ఉంటే.. ఎన్టీఆర్ కే ఎక్కువ క్రెడిట్ ఇచ్చారని అందరూ అనేవారు. కానీ క్లైమాక్స్ లో రాంచరణ్ పాత్ర… ఎన్టీఆర్ పాత్రని గైడ్ చేయడం వల్ల అందరికీ డామినేట్ చేసినట్లు అనిపించిందేమో తప్ప..
అక్కడ ఇద్దరి పాత్రలూ సమానమే” అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో కొంత ఫ్యాన్ వార్స్ కూడా ఆగాయి. కానీ ఎప్పుడైతే విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad).. పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘సపోర్టింగ్ రోల్లో ఎన్టీఆర్ బాగా చేశాడు’ అంటూ ప్రస్తావించడం వల్ల ఈ ఫ్యాన్ వార్స్ మళ్ళీ మొదలైనట్టు అయ్యింది. సరే పెద్దాయన.. పెద్ద వయసు.. ఏదో ధ్యాసలో ఆ మాట అని ఉండవచ్చు అని రెండు, మూడు రోజుల తర్వాత ఫ్యాన్ వార్స్ ఆగాయి. కానీ నిన్న ‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్ ఈవెంట్ కి రాజమౌళి హాజరయ్యారు.
ఈ క్రమంలో రాజమౌళికి.. ‘ఎన్టీఆర్ పాత్రని తక్కువ చేసి చరణ్ పాత్రని హైలెట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి.. దీనిపై మీరు ఎప్పుడూ స్పందించలేదు.. ఇప్పుడు క్లారిటీ ఇస్తే బాగుంటుంది’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రాజమౌళి..’ ఇది సందర్భం కాదు’ అంటూ ఇబ్బంది పడుతూనే ఆ ప్రశ్నకు జవాబు చెప్పడాన్ని స్కిప్ చేశారు. దీంతో మళ్ళీ ఫ్యాన్ వార్స్ కి తెరలేపినట్టు అయ్యింది. అయినా ఇప్పుడు ఆ టాపిక్ ని టచ్ చేయడం అనేది కూడా సరికాదు అనే చెప్పాలి. ఇంకో రకంగా చెప్పాలంటే ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ ఉంటాయి.
ఆ పాత్ర తీరుతెన్నుల్ని అర్ధం చేసుకోకుండా అంత గొప్ప స్టార్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ దాన్ని యాక్సెప్ట్ చేయడు కదా.? సో ఇక్కడ రాజమౌళిని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు.’ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అయ్యి రెండేళ్లు దాటింది.. ఇంకా అలాంటి ప్రశ్నలు.. ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని, రాజమౌళిని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఎందుకు?’ చెప్పండి. ‘ఆర్.ఆర్.ఆర్’ అనేది ఓ గొప్ప ఎక్స్పీరియన్స్.. ‘చూసి ఎంజాయ్ చేయాలి… చూస్తూ ఎంజాయ్ చేయాలి’..! అంతే..!