యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన దేవర (Devara) సినిమా మొదట కాస్త డివైడ్ టాక్ అందుకున్నప్పటికి ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు అందుకుంది. మెల్లగా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుని, పాజిటివ్ టాక్‌తో 400 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్‌లో సోలోగా హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. దర్శకుడు కొరటాల శివకు (Koratala Siva) కూడా ఇది బౌన్స్ బ్యాక్ మూవీగా మారింది. సినిమాకు హై ఎమోషనల్ డ్రామాతో పాటు మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ గా నిలిచింది.
Devara 2
ఇక సినిమా చివర్లో దేవర పాత్ర మరణించినట్లు చూపించినప్పటికీ, దానికి సంబంధించి చాలా విషయాలు క్లారిటీగా చెప్పలేదు. చివరి సీన్స్‌లో వర పాత్రకి దేవర బాధ్యతలు అప్పగించినట్లు చూపించారు. దీనిపై రెండో పార్ట్‌లో మరింత వివరణ రానుందని ఆడియన్స్ భావిస్తున్నారు. అందులో ప్రధానంగా యతి పాత్ర ఎవరిది, దేవర నిజంగా మరణించారా అనే అంశాలు క్లారిటీ ఇవ్వబడతాయని ఆశిస్తున్నారు.
తాజాగా, దేవరలో భైరా కొడుకుగా నటించిన కన్నడ నటుడు తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వికటకవి మూవీ ప్రమోషన్‌లో మాట్లాడుతూ, దేవర పాత్ర అసలు చనిపోలేదని, ఆ కథనానికి రెండో భాగంలో పూర్తిస్థాయిలో వివరణ ఉంటుందని తెలిపారు. దేవర పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను పార్ట్ 2 కోసం ముందే చిత్రీకరించారని చెప్పి సస్పెన్స్‌ను మరింత పెంచారు.
తారక్ పొన్నప్ప పేర్కొన్న మరో ముఖ్యమైన విషయం యతి క్యారెక్టర్ గురించి. మొదటి భాగంలో ఈ క్యారెక్టర్ గురించి వివరాలు రానివ్వకుండా సస్పెన్స్‌లో ఉంచిన దర్శకుడు కొరటాల శివ, రెండో భాగంలో ఆ పాత్రను చూపించనున్నారని వెల్లడించారు. ఇది ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచింది. ఇదిలా ఉంటే, దేవర 2 (Devara 2) షూటింగ్ 2025 చివర్లో మొదలవుతుందనే ప్రచారం ఉంది. కొరటాల శివ ఈ చిత్రానికి (Devara 2) మరింత హైప్ను అందించేందుకు కథలో కొత్త మలుపులు తీసుకొస్తారని సమాచారం.