చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కట్లేదు, కెరీర్ ప్రారంభం లో ఆయన హీరో గా నిలదొక్కుకోవడానికి ఎన్ని కష్టాలు మరియు ఎన్ని ఇబ్బందులను ఎదురుకున్నాడో మన అందరికీ తెలిసిందే.. అయితే చిరంజీవి కెరీర్ ని అప్పట్లో మలుపు తిప్పిన సినిమాలలో ఒకటి ‘ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య’ అనే చిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో థియేటర్స్ లో సంవత్సరం ఆడింది.
అప్పటి వరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు మరియు విలన్ వేషాలు వేసుకుంటున్న చిరంజీవిని హీరో గా నిలబెట్టిన చిత్రం ఇది. ఇందులో హీరోయిన్ మాధవి నటించింది. అప్పట్లో ఈమె పెద్ద స్టార్ హీరోయిన్,చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పి ఆయనని స్టార్ హీరో గా నిలబెట్టిన ‘ఖైదీ’ సినిమాలో కూడా హీరోయిన్ మాధవి గారే. అలా చిరంజీవి కి ఆమె చాలా లక్కీ హీరోయిన్ అని చెప్పొచ్చు. చిరంజీవి కి ఈమె లక్కీ హీరోయిన్ అవ్వొచ్చు కానీ, షూటింగ్ లొకేషన్ లో ఈమెతో చిరంజీవి నరకం అనుభవించేవాడట.
లొకేషన్ లో ఉన్నంతసేపు ఆమె ఎవ్వరితో సరిగా మాట్లాడేది కాదట, తన ఇంట్లో వాళ్ళు ఆమెని అలా పెంచారట.ఎవరితోనైనా క్లోజ్ రిలేషన్ ఏర్పర్చుకుంటే సినిమా షాట్స్ మీద శ్రద్ద తగ్గిపోయి, కేవలం కబుర్ల మీదనే శ్రద్ద ఉంటుందని, అందుకే ఆమె ఎవరితోనైనా లిమిట్స్ లో ఉండేదని చెప్తుంటారు. చిరంజీవి స్వయంగా ఆమె వద్దకి వెళ్లి దయచేసి నాతో క్లోజ్ గా ఉండండి, సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు మీరు మరియు నేను ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అని అనేవాడట, కానీ ఆమె మాట వినేది కాదట.
ఈమెతో రొమాంటిక్ సన్నివేశం పెట్టినప్పుడల్లా (Chiranjeevi) చిరంజీవి కి నరకం లాగ ఉండేదట, అలాంటి పరిస్థితిలో కూడా వీళ్లిద్దరి మధ్య ‘రగులుతుంది మొగలిపోగా’ వంటి హాట్ రొమాంటిక్ సాంగ్ ని వచ్చిందంటే చాలా గ్రేట్ అనే అనుకోవాలి. ఇప్పటికీ ఈ పాట బయట మారుమోగుతూనే ఉంటుంది.