బాలీవుడ్‌లో అందరికి అదృష్టం కలిసి వచ్చి హిట్ అవ్వాలన్నా, మెగాస్టార్ కావాలన్నా సాధ్యం కాదు. చాలా మంది నటులు, స్టార్‌కిడ్‌లు అయినప్పటికీ, చిత్ర పరిశ్రమలో వారు కలలుగన్న స్థానాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం మనం చెప్పుకుంటోంది అలాంటి స్టార్ కిడ్ గురించే. అతని కుటుంబం మొత్తం బాలీవుడ్‌కి చెందినది, అయినప్పటికీ అతను బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయాడు. 2012 సంవత్సరంలో నటి పరిణీతి చోప్రాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ స్టార్ కిడ్ మొదటి సినిమా హిట్ అయ్యింది.
అతనేవరో కాదు ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ ముద్దుల కొడుకు అర్జున్ కపూర్. ‘ఇషక్జాదే’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 45.73 కోట్లు రాబట్టి సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమాతో అర్జున్ కపూర్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. కానీ ఆ తర్వాతే అర్జున్ కపూర్ కు గ్రహణం పట్టింది. తన మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్న అర్జున్ కపూర్ 2013లో చేసిన ‘ఆరంజెజెబ్’ సినిమా ఘోరంగా పరాజయం పాలైంది.
దీని తర్వాత 2014లో విడుదలైన ఆయన సినిమాలు ‘గుండే’ సెమీ హిట్‌గా నిలవగా, ‘2 స్టేట్స్’ హిట్ అయింది. ఆ తర్వాత ఆయన నటించిన ‘తేవర్’, ‘నమస్తే ఇంగ్లాండ్’, ‘పానిపట్’, ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ వంటి సినిమాలు ఫ్లాప్ జాబితాలో చేరాయి. ఈ ఏడాది అర్జున్ నటించిన ‘కుట్టే’, ‘ది లేడీ కిల్లర్’ రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘కుట్టే’ రూ.4.65 కోట్లు రాబట్టి ఫ్లాప్ కాగా, ‘ది లేడీ కిల్లర్’ కేవలం రూ.లక్ష రాబట్టి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
అర్జున్ కపూర్ (Arjun Kapoor) బాక్సాఫీస్ రికార్డును చూస్తుంటే, గత 10 సంవత్సరాలుగా ఈ నటుడు హిట్ కోసం తహతహలాడుతున్నాడని స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ నటుడు ‘మేరీ పట్నీ కా రీమేక్’, రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్’లో కనిపించనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తాయో లేదో చూడాలి.