ఈ మధ్య లార్జర్ దేన్ లైఫ్ కథలకి ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు. అలాంటి సినిమాలైతేనే వాళ్ళు థియేటర్ కి వస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ డ్రామాలకి ఇప్పుడు పెద్దగా డిమాండ్ లేదు. ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి. అక్కడ జనాలకి ఒక పెయిన్ ఉండాలి. ఆల్మోస్ట్ వాళ్ళు హోప్ లెస్ అనుకున్న టైంలో హీరో రావాలి. ఈ కథలు అయితే పీరియాడిక్ అయ్యుండాలి. లేదు అంటే టైం ట్రావెల్, ఫ్యూచరిస్టిక్ అయ్యుండాలి. అయితే ఎక్కువ మంది ఓటేస్తుంది పీరియాడిక్ సినిమాలకే.
ఫోన్లు వంటివి అందుబాటులో లేని రోజుల్లో రూటెడ్ ఎమోషన్స్ తో రా అండ్ రస్టిక్ ఫ్లేవర్లో సినిమా వస్తే.. ఆడియన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాటి కోసమే తమ టికెట్ అంటున్నారు. ‘పుష్ప’ తో (Pushpa) వీటికి పాన్ ఇండియా రీచ్ వచ్చింది. ఆ సినిమా హిందీలో కూడా సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. సెకండ్ పార్ట్ అయితే అక్కడి ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. ఆ తర్వాత ఇలాంటి రా అండ్ రస్టిక్ డ్రామాలు క్యూ కట్టాయి.
నాని (Nani) ‘దసరా’ (Dasara), కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (KA) ఈ కోవలోకే వస్తాయి. అవి 2 మంచి విజయాలు సాధించాయి. త్వరలో రాబోతున్న ‘పెద్ది’ (Peddi), ‘లెనిన్’ (Lenin) సినిమాలు కూడా అంతే..! కానీ వాస్తవానికి ‘పుష్ప’ కంటే ముందు ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమా వచ్చింది. ‘పుష్ప’ వంటి సినిమాలకి బూస్టప్ ఇచ్చింది ఆ సినిమానే. ‘రంగస్థలం’ లో రాంచరణ్ (Ram Charan) నటన కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కచ్చితంగా అతని నటనకి నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు. కానీ క్రెడిట్ అంతా అల్లు అర్జున్ (Allu Arjun) కి, ‘పుష్ప’ సినిమాకి వెళ్ళింది.