టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన కృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా ఈ నెల 31వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా 4కే వెర్షన్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.
కృష్ణగారు (Krishna) సినిమాల్లోకి వస్తానని చెబితే అభ్యంతరం చెప్పలేదని రమేష్ బాబు పుట్టాకే కృష్ణగారు సినిమాల్లోకి వచ్చారని ఆయన తెలిపారు. గూఢచారి 117 సినిమా వల్ల మాస్ ఫ్యాన్స్ లో కృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం 8 నుంచి 10 సినిమాల్లో కృష్ణగారు యాక్ట్ చేశారని ఆది శేషగిరిరావు అన్నారు. అగ్నిపరీక్ష సినిమాకు 6 లక్షలు ఖర్చు చేస్తే పెట్టిన పెట్టుబడి రాలేదని ఆయన అన్నారు.
మోసగాళ్లకు మోసగాడు సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయని ఆది శేషగిరిరావు వెల్లడించారు. ఆ సినిమా గురించి సీనియర్ ఎన్టీఆర్ సైతం ప్రశంసించారని ఆయన తెలిపారు. పండంటి కాపురం సినిమాతో కృష్ణగారు ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారని ఆది శేషగిరిరావు పేర్కొన్నారు. స్టోరీ సెలక్షన్ ను అందరం కూర్చుని ఫిక్స్ చేసేవాళ్లమని ఆయన తెలిపారు. కృష్ణగారు నిర్మాత కష్టాల్లో ఉన్న సమయంలో తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారని ఆయన చెప్పుకొచ్చారు.
నిర్మాత నష్టాల్లో ఉంటే కృష్ణగారు ఎదురు డబ్బులు ఇచ్చి సినిమా రిలీజ్ చేసిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన వెల్లడించారు. కృష్ణగారి హైయెస్ట్ రెమ్యునరేషన్ 25 లక్షల రూపాయలు అని ఆయన తెలిపారు. 20 సినిమాలకు కేవలం 5,000 రూపాయల పారితోషికంకు ఆయన పని చేశారని ఆది శేషగిరిరావు తెలిపారు. మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.