Vettaiyan: సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ రైట్స్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
- August 19, 2024 / 02:20 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ రజనీకాంత్ కు (Rajinikanth) తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే రజనీకాంత్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. వేట్టయాన్ (Vettaiyan) సినిమాకు కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ కు ఈ సినిమా మరో జైలర్ (Jailer) అవుతుందని అభిమానులు ఫీలవుతున్నారు. వేట్టయాన్ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కుల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.
Vettaiyan

సీడెడ్ కాకుండా ఈ సినిమా హక్కులు 14 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. సీడెడ్ హక్కులు కూడా కలిపితే ఈ మొత్తం 17 నుంచి 18 కోట్ల రూపాయలకు చేరే అవకాశం అయితే ఉంది. జై భీమ్ ఫేమ్ జ్ఞాన్ వేల్ (T. J. Gnanavel) ఈ సినిమాకు దర్శకుడు కావడం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh Ravichander) సైతం ఈ సినిమా కచ్చితంగా హిట్ గా నిలుస్తుందనే అర్థం వచ్చేలా కామెంట్లు చేయడం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి.
ఈ సినిమాలో రానా (Rana) విలన్ గా నటిస్తుండటం వల్ల కూడా తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని చెప్పవచ్చు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ (Amitabh Bachchan) సైతం ఈ సినిమాలో భాగమయ్యారు. ఒక పాన్ ఇండియా సినిమాకు అవసరమైన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) ఈ సినిమాలో ఫన్ రోల్ లో కనిపిస్తారని మంజు వారియర్ పాత్ర సైతం కథలో కీలకమని భోగట్టా.

అక్టోబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుండగా కంగువ (Kanguva) సినిమాకు పోటీగా ఈ సినిమా (Vettaiyan) విడుదల కానుండటం గమనార్హం. రజనీకాంత్ వయస్సు 73 సంవత్సరాలు కాగా ఈ మధ్య కాలంలో ఆయన వయస్సుకు తగ్గ రోల్స్ ను ఎంచుకుంటూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఖాతాలో మరిన్ని సంచలన రికార్డులు చేరాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిసున్నారు.














