#justiceforSushantSinghRajput… ఏడాదికిపైగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్. ఇది చూస్తే ఎవరికైనా విషయం ఈజీగా అర్థమైపోతుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఆత్మహత్య కాదని, దాని వెనుక ఉన్న అసలు కారణాలు గుర్తించాలని సుశాంత్ కుటుంబ సభ్యులు, అభిమానులు చాలా రోజులుగా కోరుకుంటున్నారు. తాజాగా దీనికి సంబంధించి సుశాంత్ సింగ్‌రాజ్ పుత్ సోదరి ప్రియాంక ఓ విజ్ఞప్తి చేశారు. వీకీపీడియా వ్యవస్థాపకులు జిమ్మి వేల్స్, ల్యారీ సాంగర్‌కు సుశాంత్ సోదరి ప్రియాంక ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
‘సమాచారం అనేది శక్తిగా మారిన ప్రస్తుత తరుణంలో… వాస్తవాలకు కట్టుబడి ఉండటం గొప్ప విశేషం. మీరది చేస్తున్నారు. అయితే, వికీపీడియాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని రాసి ఉంది. అయితే ఆ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు. దయచేసి దానిని సుశాంత్ మరణానికి కారణం తెలియాల్సి ఉంది’ అని మార్చగలరు అని ప్రియాక కోరింది. ‘‘నా సోదరుడికి న్యాయం దక్కాలని #justiceforSushantSinghRajput పేరుతో పోరాటం చేస్తున్నాం.
అలాగే సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కాబట్టి సుశాంత్ వికీపీడియా పేజీలో మరణానికి గల కారణం… ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అని కాకుండా… ఇంకా ఈ కేసు విచారణలో ఉంది అని మార్చాలి’ అని ప్రియాంక కోరింది. దాంతోపాటు సుశాంత్ ఎత్తును 183 సెం.మీగా చేర్చాలని కూడా కోరారు. తెలిపింది. గతేడాది జూన్ 14న ముంబయిలోని బాంద్రాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.