చివరికి ఫేడౌట్ అయిపోయిన హీరోకి జోడిగా కూడా నటించేస్తుంది..!

తమన్నా.. దాదాపు 16 ఏళ్ళుగా హీరోయిన్ గా రాణిస్తోంది. కొత్త భామలు ఎంత మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ సత్తాని చూపిస్తున్నా.. వారి పోటీని తట్టుకొని మరీ నిలబడుతుంది. చెప్పాలంటే ఈమె కెరీర్ కూడా క్లైమాక్స్ లో ఉంది అనేది వాస్తవం. కానీ ఈమె అవకాశాలు లేక ఖాళీగా ఉండడం లేదు. నిత్యం ఏదో ఒక సినిమా లేదా వెబ్ సిరీస్.. అవి కూడా కాదు అంటే ఓటిటిలకు సంబంధించి ఏదో ఓక షో వంటి వాటిలో పాల్గొంటూ వస్తుంది.

సీనియర్ హీరోల సరసన కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్లో కూడా నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం తమన్నా.. ‘మ్యాస్ట్రో’ ‘ఎఫ్3’ ‘సీటిమార్’ ‘గుర్తుందా శీతాకాలం’ వంటి ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. అంతేకాకుండా బాలీవుడ్లో దర్శకుడు శశాంక్ ఘోష్ తెరకెక్కిస్తున్న ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’ అనే మూవీలో కూడా నటిస్తుంది తమన్నా. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో జెనీలియా భర్త రితేష్ దేశముఖ్ హీరోగా నటిస్తుండడం విశేషం.

అతనికి జోడీగానే తమన్నా నటిస్తోంది. నిజానికి రితేష్ దేశముఖ్ ఎప్పుడో ఫేడౌట్ అయిపోయాడు. అతని సరసన నటించడానికి కూడా తమన్నా వెనుకాడలేదు. ఆన్ సెట్స్ లో వీరిద్దరికీ మధ్య చిత్రీకరిస్తున్న ఓ సన్నివేశం సమయంలో ఓ ఫోటోని క్లిక్ మనిపించినట్టు ఉన్నారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Share.