టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో టీజీ విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఒకరు కాగా ఈ నిర్మాత హైదరాబాద్ లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఏపీలో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ఆయన ఈ వేడుకను నిర్వహించడం జరిగింది. “సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన విజయం చారిత్రాత్మకం” అని టీజీ విశ్వ ప్రసాద్ చెప్పుకొచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత అయిన ఈ నిర్మాత తాను చిన్నప్పటి నుంచి చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు.
చిరంజీవిని దూరం నుంచి చూస్తే చాలని అనుకున్నానని విశ్వ ప్రసాద్ వెల్లడించారు. అలాంటిది చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) కలిసి పని చేసే ఛాన్స్ దక్కిందని బ్రో (Bro) సినిమా గురించి ఆయన ప్రస్తావించారు. పవన్, సాయితేజ్ (Sai Tej) కలిసి నటించిన బ్రో సినిమా పీపుల్స్ మీడియా బ్యానర్ పై తెరకెక్కగా ఈ సినిమా అబవ్ యావరేజ్ గా నిలిచింది. అయితే నిర్మాతలకు మాత్రం ఈ సినిమా మంచి లాభాలను అందించిందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఒక రకమైన ఆనందంలో ఉన్నారని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టి మాట్లాడుతున్న సమయంలో రోమాలు నిక్కబొడుచుకున్నాయని దర్శకుడు మారుతి వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయం పడుతుందని సమాచారం అందుతోంది. పవన్ ప్రస్తుతం పొలిటికల్ కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
పవన్ కళ్యాణ్ ఆగష్టు నెల నుంచి సినిమాల షూటింగ్ లలో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ పారితోషికం 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. సినిమాల్లో పవర్ స్టార్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సైతం పవర్ స్టార్ అని అనిపించుకోవడం గమనార్హం. పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.