2025 లో రాబోతున్న పెద్ద సినిమాల్లో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా ఒకటి. మారుతి (Maruthi Dasari) ఈ చిత్రానికి దర్శకుడు. ఇది పాన్ ఇండియా సినిమా. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘ఇదొక హర్రర్ రొమాంటిక్ కామెడీ సినిమా’ అని మేకర్స్ .. ఓ గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘బాహుబలి 2’ (Baahubali 2) తర్వాత ప్రభాస్ (Prabhas) అన్నీ పాన్ ఇండియా సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఒక్క ‘రాధే శ్యామ్’ ని (Radhe Shayam) పక్కన పెడితే మిగిలిన ‘సాహో’ (Saaho) ‘ఆదిపురుష్’ (Adipurush) వంటి ప్లాప్ సినిమాలు కూడా భారీ ఓపెనింగ్స్ ను సాధించాయి.
Thaman
వాటి బడ్జెట్లు పెరిగిపోవడం వల్ల.. అవి కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. కానీ వాటి ఓపెనింగ్స్ చూసి బాలీవుడ్ స్టార్స్ కూడా షాక్ తిన్నారు. హిందీలో ఆ సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ తో బడ్జెట్ ని లిమిట్లో పెట్టుకుని సినిమాలు చేస్తే.. కచ్చితంగా అవి భారీ లాభాలు అందిస్తాయి అని ‘సాహో’ ‘ఆదిపురుష్’ వంటి సినిమాలు స్పష్టం చేశాయి. ‘ది రాజాసాబ్’ సినిమా కూడా రూ.400 కోట్ల బడ్జెట్లో రూపొందుతుంది.
బిజినెస్ రూ.500 జరిగే ఛాన్స్ ఉంది. సో నిర్మాత రిలీజ్ కి ముందే ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి టైంలో సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) ‘ది రాజాసాబ్’ పై హైప్ లేదు అంటూ చేసిన కామెంట్స్ షాకిచ్చాయి. తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” ‘ది రాజాసాబ్’ సినిమా ఆడియో లాంచ్ జపాన్లో జరగొచ్చు. దానికి జపాన్ వెర్షన్ కూడా అడుగుతున్నారు. ఆ సినిమాపై హైప్ లేదు.
ఆడియన్స్ ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ మాకు అదే ప్లస్ పాయింట్. ఎంత తక్కువ హైప్ ఉంటే. ఔట్పుట్ అంత బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఓ కమర్షియల్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒక ఇంట్రో సాంగ్, ఐటెం సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ఒక సాంగ్… ఇలా ‘ది రాజాసాబ్’ ఒక కమర్షియల్ ఆల్బమ్’ అంటూ చెప్పుకొచ్చాడు.
TheRajaSaab Film Audio launch JAPAN lo kuda jargutadhi