నితిన్ (Nithiin) హీరోగా దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో ‘తమ్ముడు’ (Thammudu) అనే సినిమా రూపొందింది. ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram) ఈ చిత్రానికి దర్శకుడు. లయ (Laya) , వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సప్తమి గౌడ (Sapthami Gowda) కీలక వంటి హీరోయిన్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అంటూ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే సినిమా థీమ్ ఎలా ఉంటుందో కూడా హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. జూలై 4న ఈ సినిమాను రిలీజ్ కూడా ఆ మోషన్ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ న తెలుపుతూ కూడా దర్శకుడు వేణు, నటి లయ ఒక వీడియో కూడా చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ మారినట్టు అర్ధం చేసుకోవచ్చు. విషయం ఏంటంటే.. ‘తమ్ముడు’ చిత్రాన్ని జూలై 4న విడుదల చేస్తున్నట్టు ఎలా ప్రకటించారో.. అదే విధంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘కింగ్డమ్’ (Kingdom) చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘కింగ్డమ్’ అనేది పాన్ ఇండియా సినిమా.
కాబట్టి.. ఆ సినిమాకి పోటీగా ‘తమ్ముడు’ ని దింపే అవకాశాలు తక్కువ. పైగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారి సినిమా అంటే సగం దిల్ రాజు సినిమానే..! ఎందుకంటే నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మించే ప్రతి సినిమాని దిల్ రాజు నైజాంలో రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి.. ‘తమ్ముడు’ సినిమా మరోసారి వాయిదా పడినట్టే..! కాకపోతే అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారో తెలియాల్సి ఉంది.