మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ స్టార్ హోటల్లో, అమీర్ ఖాన్ వంటి పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో చిరు ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 46 యేళ్ళు పూర్తికావస్తున్న నేపధ్యంలో ఆయనకు ఈ పురస్కారం లభించడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతుంది అని చెప్పాలి.
Chiranjeevi
నాలుగు దశాబ్దాలగా అభిమానులను, మూవీ లవర్స్ ను తన నటనతో, డాన్స్ తో అలరిస్తూ వస్తున్నారు మెగాస్టార్. మాస్ లో మెగాస్టార్ తోపు. అందుకే ఆయన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. 70 ఏళ్ళ వయసులో కూడా ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి అంటే.. చిరు స్టార్ డం పదిలంగా ఉందని అర్థం చేసుకోవచ్చు.
చిరు తన 45 ఏళ్ల కెరీర్లో 156 సినిమాలు చేశారు. ఇక వాటిలో 537 పాటలు ఉన్నాయి. ఆ 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో ఇండియా మొత్తాన్ని అలరించారు చిరు. ప్రధానంగా ఆయన డాన్స్ మూమెంట్స్ కారణంగానే.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరు పేరు చేరినట్టు స్పష్టమవుతోంది.
ఇక ఈ వేడుకలో గిన్నిస్ బుక్ ప్రతినిధులు, అమీర్ ఖాన్ తో పాటు చిరంజీవితో సినిమాలు చేసిన టాప్ డైరెక్టర్స్…కే రాఘవేంద్ర రావు, బాబి, గుణశేఖర్, బి గోపాల్, కోదండరామిరెడ్డితో పాటు అల్లు అరవింద్, సురేష్ బాబు, జెమినీ కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు వంటి నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
The Guinness World Records has recognised #MegastarChiranjeevi Konidela as the Most Prolific Film Star in Indian Film Industry, Actor / Dancer.