టి.ఎన్.ఆర్, కత్తి మహేష్ ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ ఛానెల్ లో 3 గంటల పాటు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసేవారు టి.ఎన్.ఆర్. నిజానికి ఓ ఇంటర్వ్యూ కాసేపు చూస్తేనే ఫాస్ట్ ఫార్వార్డ్ చేయడం లేదా వేరే వీడియో క్లిక్ చేయడం వంటివి చేస్తుంటారు. కానీ టి.ఎన్.ఆర్ ఇంటర్వ్యూలు ఎక్కువ నిడివి ఉన్నప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేవారు. అలాగే నటుడిగా కూడా వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చారు టి.ఎన్.ఆర్. కానీ ఊహించని విధంగా ఆయన్ని కరోనా బలితీసుకుంది.
45 ఏళ్ళకే ఆయన మరణించడం ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. మరో పక్క కత్తి మహేష్ పరిస్థితి కూడా ఇంచు మించు ఇంతే..! రోడ్డు ప్రమాదంలో ఇతను మరణించాడు. ‘బిగ్ బాస్’ తో పాపులర్ అయిన ఇతను అటు తర్వాత పలు సినిమాల్లో కూడా నటించాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న మాటల యుద్ధం ఇతన్ని మరింత పాపులర్ చేసింది. ఇతను కూడా 44 ఏళ్ళకే మరణించాడు. అయితే ఈ ఇద్దరి జర్నలిస్ట్ ల విషయంలో ఇప్పుడు ఒకే సీన్ రిపీట్ అవుతుంది.
అదేంటి అంటే వీళ్ళు నటించిన సినిమాలు వీళ్ళు పోయిన తర్వాత రిలీజ్ అవుతుండడం. ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ మూవీలో అలాగే ‘వివాహ భోజనంబు’ మూవీలో టి.ఎన్.ఆర్ నటించాడు.’ఎస్.ఆర్.కళ్యాణమండపం’ హిట్ అయ్యింది.ఇక ‘వివాహ భోజనంబు’ మూవీ సోని లివ్ ఓటిటిలో విడుదల కాబోతుంది. ఇక సంపూర్ణేష్ బాబు నటించిన ‘బజార్ రౌడి’ మూవీలో కత్తి మహేష్ నటించాడు. ఆగస్ట్ 20న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమాల కారణంగా టి.ఎన్.ఆర్, కత్తి మహేష్ లను మరోసారి తెర పై చూడొచ్చన్న మాట.