Naga Chaitanya, Samantha: ఆ హీరో వల్లే చైతన్య సమంత విడిపోయారా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ చైతన్య సమంతల విడాకుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్న చైతన్య సమంత విడిపోవడంతో ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ఈ జంట విడిపోవడానికి కారణాలను వెల్లడించకపోవడంతో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వీళ్లిద్దరికీ సంబంధించిన వార్తలే ఎక్కువగా వస్తుండటం గమనార్హం. వివాదాల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ చైతన్య సమంత విడిపోవడానికి అమీర్ ఖాన్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమీర్ ఖాన్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో విడాకుల స్పెషలిస్ట్ గా పేరుందని అమీర్ ఖాన్ ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. పది సంవత్సరాలుగా ప్రేమించుకుని సమంత చైతన్య నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని అమీర్ ఖాన్ ను చైతన్య కలిసిన తర్వాతే అమీర్ సూచనల మేరకు చైతన్య సమంతకు విడాకులిచ్చాడని కంగనా వెల్లడించారు. కంగనా చేసిన విచిత్రమైన వ్యాఖ్యల గురించి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

కంగనా ఇదే సమయంలో దేవుడు మహిళలను బలిపశువులుగా మగాళ్లను వేటగాళ్లుగా సృష్టించాడని చెప్పుకొచ్చారు. దుస్తులను మార్చినంత తేలికగా ఆడవాళ్లను మార్చే పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కంగనా రనౌత్ వెల్లడించారు. కంగనా కామెంట్ల గురించి అమీర్ ఖాన్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. లాల్ సింగ్ చద్దా సినిమాలో అమీర్ ఖాన్, నాగచైతన్య కలిసి నటించడంతో కంగనా ఈ కామెంట్లు చేశారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.