‘బాహుబలి'(సిరీస్) (Baahubali) తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుసగా పెద్ద సినిమాలే చేస్తున్నాడు. అవి పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు.. సీక్వెల్స్ కి స్కోప్ ఉన్న ప్రాజెక్టులు కావడం విశేషంగా చెప్పుకోవాలి. ‘సలార్’ (Salaar) ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) వంటివి సీక్వెల్ కి స్కోప్ ఉన్న సినిమాలు. అవి రెండూ సూపర్ హిట్లు అవ్వడంతో.. వీటి సీక్వెల్స్ పై కూడా అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ తో పాటు ‘ది రాజాసాబ్’ (The Raja saab) షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు.
‘కల్కి 2898 AD’ తర్వాత ప్రభాస్ నుండి వచ్చే సినిమా ‘ది రాజాసాబ్’ కావడం గమనార్హం.మారుతి దీనికి దర్శకుడు. దీనిపై పెద్దగా అంచనాలు అయితే లేవు కానీ.. మౌత్ టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించే అవకాశం లేకపోలేదు. పైగా హారర్ జోనర్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న సినిమా ఇది. వీటికి మంచి డిమాండ్ కూడా ఉంది. వాస్తవానికి ఏప్రిల్ 10నే ‘ది రాజాసాబ్’ రిలీజ్ అవుతుంది అని అనుకున్నారు.
కానీ కొన్ని కారణాల వల్ల రెండు నెలలు వాయిదా పడనుంది అనే టాక్ నడుస్తుంది. హారర్ జోనర్ సినిమా కావడంతో వీఎఫ్ఎక్స్ కి కొంచెం ఎక్కువ టైం పడుతుందట.అందువల్ల సెప్టెంబర్ కి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సమ్మర్ ని ‘రాజాసాబ్’ మిస్ చేసుకున్నట్టే అని చెప్పాలి. మరోపక్క దీనికి సీక్వెల్ కూడా ఉంటుంది అనేది లేటెస్ట్ టాక్. క్లైమాక్స్ లో దానికి తగ్గట్టు లీడ్ కూడా ఇస్తారట.
ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకి శుభం కార్డు బదులు సీక్వెల్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఎండ్ చేస్తున్నారు. కానీ సినిమా హిట్ అయితేనే మేకర్స్ కూడా సీక్వెల్ ను మొదలుపెడతారు. లేదు అంటే వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. ‘ది రాజాసాబ్’ కి సీక్వెల్ అనౌన్స్ చేసినా.. మొదటి భాగం ఆకట్టుకుంటేనే సీక్వెల్ పై ఆసక్తి ఉంటుంది లేదంటే ప్రేక్షకులు అవసరం లేదు అని తేల్చేస్తారు.