Pawan Kalyan: పవన్ అసలు పేరు మనం అనుకుంటున్నది కాదు.. ఇంకొకటి ఉంది తెలుసా?
- October 4, 2024 / 02:39 PM ISTByFilmy Focus
పవన్ కల్యాణ్ అసలు పెరేంటో తెలుసా? ఈ ప్రశ్న అడగ్గానే అతని అభిమానులు, ప్రేక్షకులు చాలా కాన్ఫిడెంట్ కల్యాణ్ అని, కల్యాణ్ బాబు అని చెప్పేస్తారు. నిన్న మొన్నటివరకు మేం కూడా ఇదే అనుకున్నాం. జనాలూ అదే అనుకున్నారు. కానీ లేటెస్ట్ ఆయన మాతృమూర్తి అంజనా దేవి ఇచ్చిన ఇంటర్వ్యూ బయటకు వచ్చాక మొత్తం మారిపోయింది. ఆయన అసలు పేరు ఇన్నాళ్లూ మనం అనుకున్నది కాదు. ఆ విషయంతోపాటు అంజనా దేవి మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. ఇప్పుడు ఆ అంశాలు వైరల్‌గా మారాయి.
Pawan Kalyan
జనసేన అంటూ సినిమా కెరీర్‌ను పక్కన పెట్టి జనాల మధ్యలోకి వెళ్లి రాత్రింబవళ్లూ కష్టపడ్డాడు పవన్. అలా తిరుగుతుంటే తల్లిగా బాధ కలిగింది. అయితే వాడు ఎక్కడున్నా అంతే.. షూటింగులు చేసి వచ్చి సోఫాలోనే నిద్రపోయేవాడు. ఎంత కష్టపడినా ‘ఇంత కష్టపడ్డాను’ అని ఏనాడూ చెప్పేవాడు కాదు అని అంజనా దేవి నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. పవన్‌కు చిన్నతనం నుండే దైవభక్తి ఉండేదని, ఇప్పుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దీక్ష తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు.

చిన్నప్పటి నుండ పవన్ వాళ్ల నాన్నతో ఎక్కువగా ఉండేవాడని, ఎక్కువగా మాట్లాడకుండా ఉండటంతో వాళ్ల నాన్నకి పవన్ అంటే ఎక్కువ ఇష్టమని సీక్రెట్ చెప్పారు మెగా మదర్. చిన్నప్పుడు వాళ్ల అన్నయ్య చిరంజీవికి క్లోజ్‌గా ఉండేవాడని, తండ్రి ఉద్యోగాలు – బదిలీల వల్ల చదువులు సరిగా ఉండవని కల్యాణ్‌ని చిరంజీవి మద్రాసు తీసుకువెళ్లిపోయాడని చెప్పారు. ఈ క్రమంలోనే పవన్ అసలు పేరు శ్రీ కళ్యాణ్ కుమార్ అని చెప్పారు. అది వేంకటేశ్వరస్వామి పేరు అని కూడా తెలిపారు.

అదన్నమాట అసలు సంగతి.. ఇన్నాళ్లూ మనం పవన్ ఒరిజినల్ పేరు కల్యాణ్ బాబు అని అనేవాళ్లం. చిరంజీవి, నాగబాబు కూడా అదే చెప్పేవారు. అయితే శ్రీ కల్యాణ్ కుమార్ నుండి కల్యాణ్ తీసుకొని సినిమా వాళ్లకు బాగా అలవాటైన బాబును చివర యాడ్ చేసుకున్నారన్నమాట.

















