యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన రామయ్యా వస్తావయ్యా (Ramayya Vasthavayya) సినిమా ఒకింత భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైనా సెకండాఫ్ ప్రేక్షకులను మెప్పించకపోవడం, శృతి హాసన్ (Shruti Haasan) డ్రెస్సింగ్ విషయంలో నెగిటివ్ కామెంట్లు, కథనంలో లోపాలు ఆ సినిమాకు మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో బుడ్డోడు డైలాగ్ ఊహించని స్థాయిలో పాపులర్ అయింది. “ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా..
Ramayya Vasthavayya
అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి లేదా నా అభిమానై ఉండాలి” అంటూ తారక్ చెప్పిన డైలాగ్ తెగ వైరల్ అయింది. మిస్టర్ బచ్చన్ ’ (Mr Bachchan) ప్రమోషన్స్ లో భాగంగా బుడ్డోడు డైలాగ్ వెనుక షాకింగ్ విషయాలను హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. గతంలో పలు సందర్భాల్లో ఈ డైలాగ్ గురించి వివరణ ఇచ్చిన హరీష్ శంకర్ తాజాగా మరోమారు వివరణ ఇచ్చారు.
సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను నేను టైగర్ అని పిలుస్తానని అయితే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ అయిన తర్వాత చాలామంది టైగర్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అని అని అడిగేవారని తారక్ ను బుడ్డోడు అని పిలిస్తే నాకు అస్సలు నచ్చదని అలా ఎవరైనా పిలిస్తే కోపం వచ్చేదని పేర్కొన్నారు. ఆ కోపంలో నేను రాసిన డైలాగ్ బుడ్డోడి డైలాగ్ అని హరీష్ శంకర్ అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తే మరో సినిమా (Ramayya Vasthavayya) చేయాలని హరీష్ శంకర్ ఆశ పడుతున్నా ఇప్పట్లో ఈ కాంబినేషన్ సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. హరీష్ శంకర్ చేతిలో ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ తో (Ustaad Bhagat Singh) పాటు రామ్ (Ram) సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో కచ్చితంగా విజయాలను సొంతం చేసుకోవాల్సిన బాధ్యత హరీష్ శంకర్ పై ఉంది. హరీష్ శంకర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.