ఈ రోజుల్లో పెద్ద సినిమలైనా మీడియం బడ్జెట్ సినిమలైనా ఓపెనింగ్స్ తోనే సేఫ్ జోన్ లోకి రావాలని చూస్తారు. ఫస్ట్ వీకెండ్ లో వీలైనంత వసూళ్లు అందుకుంటేనే పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి. ఇక చెక్ సినిమా కూడా అదే తరహాలో సేఫ్ జోన్ లోకి రావాలని అనుకుంటోంది. అయితే వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ సినిమా టికెట్స్ రేట్స్ పెంచేయడం. ఒక్కసారిగా ఉన్న ధరలో మరో 50 రూపాయలు ఎక్కువగా పెంచేయడం ఈ సినిమాపై ఎఫెక్ట్ పడినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్ధమవుతుంది.
భీష్మ సినిమాకు నితిన్ 6కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకోగా ఈ సినిమా కనీసం 4కోట్ల షేర్స్ అందుకోకపోవడం విశేషం. తొందరగా రికవరీ చేయాలనే ఆలోచనతో ఈ తరహాలో రేట్స్ పెంచితే సేఫ్ అనుకున్నట్లున్నారు. కానీ ఓ వర్గం ఆడియెన్స్ సినిమాకు దురమయ్యారనే చెప్పాలి. 100 రూపాయల టికెట్ ను 150కు పెంచేశారు. ఇక 150 ఎక్కువ అనుకుంటే 200 చేసేశారు. మల్టీప్లెక్స్ కు వెళ్ళాలి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు చాలా కష్టంగానే ఉంటుంది.
అసలైన ఫ్యామిలీ ఆడియెన్స్ ను మిస్ చేసుకుంటే సినిమా కలెక్షన్స్ పై భారీగా ప్రభావం పడక తప్పదు. మరి చెక్ ఈ రేట్లతో ఎంతవరకు లాభాలను అందుకుంటుందో చూడాలి.