గోపీచంద్ హీరోగా, డింపుల్ హయతి హీరోయిన్ గా నటించిన ‘రామబాణం’ చిత్రం మే 5వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన టైలర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలు, ఇవి రెండే మనిషిని కాపాడతాయి’ అనే డైలాగ్ తో ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రామబాణం ఇక ఇటీవలే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. కథను నమ్మి చేశానని, కొన్ని సినిమాల్లో కంప్లీట్ గా సాడ్ లేదా కమర్షియల్ సీన్స్ మాత్రమే ఉంటాయని, కానీ ‘రామబాణం’లో ఎంటర్టైన్ మెంట్ తో పాటు, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయని చెప్పారు.
తానైతే ఈ సినిమాను బయట ఉన్న ప్రపంచాన్ని ఓ రెండున్నర గంటలు మర్చిపోయేందుకు చూస్తానని చెప్పారు. ఈ కథ విన్నప్పుడు ఆ రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టేలా ఉందని, నమ్మి చేశానని గోపీచంద్ స్పష్టం చేశారు. ఆడియెన్స్ కూడా ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. తనకు మంచి మార్కెట్ ఉన్నా పాన్ ఇండియా సినిమాలు చేయకపోవడంపైనా గోపిచంద్ స్పందించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి పాన్ ఇండియా సినిమా చేయట్లేదని, రాబోయే కాలంలో అవకాశం వస్తే చేస్తానని చెప్పారు.
ఒక వేళ డబ్బింగ్ అవకాశం వచ్చినా చేస్తానని గోపీచంద్ తెలిపారు. ‘వర్షం’ తర్వాత మళ్లీ అలాంటి కాంబోను ఎక్స్ పెక్ట్ చేయగలమా అన్న దానిపైనా గోపిచంద్ మాట్లాడారు. త్వరలోనే డబుల్ షార్ట్స్ తో సినిమా వస్తుందని గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు (Prabhas) ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. ఆ వార్తలపై స్పందించిన గోపీచంద్.. తాను పిలిస్తే తప్పకుండా ప్రభాస్ వస్తాడు కానీ.. ఎంత స్నేహితుడయినా అతడు పాన్ ఇండియా స్టార్..
చాలా బిజీగా ఉన్నాడని, కాబట్టి తన సినిమా ‘రామబాణం’ ప్రీ రిలీజ్ వేడుకకు పిలవలేను అని చెప్పారు. ఫైనల్ గా ప్రభాస్ రావడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రామబాణం సినిమాలో హీరో గోపీచంద్ తో పాటు ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా తో గోపి చంద్ హ్యాట్రిక్ విజయాలు సాధిస్తారో లేదో చూడాలి.