చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో క్రియేట్ అయిన అన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్ బాహుబలి2 సినిమా సాధించిన కలెక్షన్లను మాత్రం బ్రేక్ చేయలేదు. అయితే బాహుబలి2 సినిమాను మించి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. బాహుబలి2 సినిమాకు నిర్మాత ప్లస్ అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు నిర్మాత మైనస్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బాహుబలి సిరీస్ సినిమాల నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ ఆ సినిమా సక్సెస్ కావడంలో ఆ సినిమాకు అద్భుతంగా మార్కెటింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య మాత్రం ఈ విషయంలో అంతగా సక్సెస్ కాలేకపోయారు. రాజమౌళి, తారక్, చరణ్ ఈ సినిమా కోసం తమ వంతు ప్రమోషన్స్ చేశారు. అయితే నిర్మాత దానయ్య మాత్రం ఈ సినిమా రేంజ్ ను మరింత పెంచే విధంగా ప్లాన్ చేయడంలో విఫలమయ్యారు.
శోభు యార్లగడ్డను కూడా ఈ సినిమాలో భాగం చేసి ఉంటే ఆర్ఆర్ఆర్ రేంజ్ కచ్చితంగా మరింత పెరిగి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ విషయంలో నిర్మాత వైపు నుంచి చాలా తప్పులు ఉన్నాయని నెటిజన్లు సైతం అంగీకరిస్తున్నారు. మరోవైపు రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. జక్కన్న మహేష్ కాంబో మూవీకి కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమాకు దిల్ రాజు మరో నిర్మాతగా వ్యవహరిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది రాజమౌళి మహేష్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. దాదాపుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.