దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వెండి తెరపైన గీసిన అద్భుత కళాఖండం బాహుబలి. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది. ఆ మూవీకి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ ని మరింత కనువిందుగా ఉండేలా జక్కన్న శ్రమిస్తున్నారు. అయితే రెండో పార్ట్ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ డోస్ ఎక్కువగా ఉండబోతోంది. ఆ అనుభూతి ప్రేక్షకులు పొందేలా మూవీలోనే కాకుండా థియేటర్లలోనూ మార్పులు చేస్తున్నారు. 4 కె రెజ్యూల్యేషన్ ప్రొజక్టర్లను, తెరలను అమర్చుకోవాలని థియేటర్ ఓనర్లకు సూచిస్తున్నారు. ఈ మార్పులకు ఒక థియేటర్ కి కనీసం కోటి రూపాయల వరకు వ్యయం అవుతుంది. అయినా ఖర్చు చేయడానికి 200 మంది యజమానులు ముందుకొస్తున్నారు. వారికి బాహుబలి నిర్మాతలు కూడా కొంత ఆర్ధిక సాయం చేస్తున్నట్లు తెలిసింది.
సాధారణంగా ఇప్పుడు మల్టీ ఫ్లెక్స్ లో ప్రదర్శితమయ్యే థియేటర్లలో 2 కె రెజ్యూల్యేషన్ తో అన్ని చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. ఇప్పుడిప్పుడే 4 కె రెజ్యూల్యేషన్ చిత్రాలు వస్తున్నాయి. ఇందువల్ల తెర విస్తీర్ణం పెరగడమే కాకుండా సినిమాలోని వ్యక్తులే కాదు, ప్రతి వస్తువు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సినిమా రంగంలో ఈ విప్లవానికి తెలుగులో బాహుబలి నాంది పలుకుతోంది. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.