టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ (Sundeep Kishan) ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమాతో హిట్ అందుకున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సందీప్ కిషన్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నా సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారు. ఒకవైపు సినిమాలలో సందీప్ కిషన్ కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు బిజినెస్ లో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తన రెస్టారెంట్ల నుంచి రోజుకు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నానని సందీప్ కిషన్ పేర్కొన్నారు.
ఆశ్రమాలలో ఉండే వాళ్లతో పాటు రోడ్ సైడ్ ఉండే పేదలకు తన రెస్టారెంట్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నానని సందీప్ కిషన్ పేర్కొన్నారు. పేదలకు ఉచితంగా అందించే భోజనం కోసం నెలకు 4 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నానని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ధరలకే క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని సందీప్ కిషన్ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
సందీప్ కిషన్ గొప్ప మనసును ఫ్యాన్స్ ఎంతగానో మెచ్చుకుంటున్నారు. సందీప్ కిషన్ రాయన్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. మరికొన్ని గంటల్లో రాయన్ (Raayan) మూవీ థియేటర్లలో విడుదల కానుంది. సందీప్ కిషన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సందీప్ కిషన్ పేదల కోసం చేస్తున్న మంచి పనిని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.
చాలామంది లాభాపేక్ష లక్ష్యంగా రెస్టారెంట్లను నిర్వహిస్తుండగా సందీప్ కిషన్ మాత్రం వాళ్లకు భిన్నమైన దారిలో అడుగులు వేస్తున్నారు. సందీప్ కిషన్ తను ఎంచుకునే కథల విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందీప్ కిషన్ ఇతర భాషల్లో సైతం కెరీర్ పరంగా మరింత ఎదిగితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.