కబాలి చిత్రం విడుదలయింది. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో రజని రేంజ్ ను అందుకొలేదు కానీ, ఓకే అనెలా ఉంది అన్న టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఇది పక్కా పైసా వాసూల్ మూవీ అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో కొన్న ప్రొడ్యూసర్ కేపీచౌదరి.. ఈ సినిమాను ఆయన తెలుగులో విడుదల చెయ్యకుండా ఆపాలని విశ్వ ప్రయత్నాలే జరిగాయి.
అయితే దాని కారణం రజని కాంత్. ఎందుకంటే బాబా సినిమా సమయం నుంచి ఆయన తన సినిమా తీసుకుని నష్టపోయిన వారికి డబ్బులు తిరిగి ఇప్పించే ప్రయత్నాలు చేశాడు. అది అటు కోచ్చాడీయన్ కి, లింగా వరకు సాగింది. అయితే గతంలో ఉన్న బకాయిలు తీరిస్తే గాని ఈ సినిమాను విడుదల కానివ్వం అని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అదే క్రమంలో కొత్త డిస్ట్రిబ్యూటర్ గా రంగం లోకి వచ్చిన కేపీ కబాలి సినిమా కోసం పేపర్ లో యాడ్ లు ఇస్తే వాటిని అడ్డుకున్నారు తెలుగు డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్ వారు. ఆయన దీని గురించి అడిగినప్పుడు దాసరి గారే ఆపమన్నారు అని చెప్పారు అన్ని కేపీ చెబుతున్నారు.
అదే క్రమంలో నేను ప్రొడ్యూసర్ ని కాను…అయినా ఎందుకు అంత కక్ష, అంతేకాదు….దాదాపుగా పాతిక లక్షల వరకూ డిమాండ్ చేసారు. నాకు లాభాలు ఒస్తే పాతిక కాదు ఇంకా ఎక్కువే ఇస్తా ” అంటూ ఒక ఛానల్ తో లైవ్ లో మాట్లాడిన కబాలి తెలుగు ప్రొడ్యూసర్ సీరియస్ అయ్యారు. ఏది ఏమైనా మొత్తానికి భారీ చిత్రంగా వచ్చిన కబాలి నిర్మతకు తిప్పలు తెప్పేలా లేవు.