బాహుబలి కంక్లూజన్ షూటింగ్లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత చేయనున్న సినిమా పనుల్లో దర్శకుడు సుజీత్ యమ బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం డైరక్టర్ ఆర్టిస్టుల సెలక్షన్ పూర్తి చేశారు. బాలీవుడ్ తార అమీ జాక్సన్ ను హీరోయిన్ గా, విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ లను ఎంపిక చేశారు. వంద కోట్ల బడ్జెక్ట్ తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీని యూవీ క్రియేషన్ వాళ్లు నిర్మిస్తున్నారు.
నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ ఫిల్మ్ కోసం నిర్మాణ సంస్థ పేరును కూడా రిజిస్టర్ చేసినట్లు తెలిసింది. యాక్షన్ థ్రిల్లర్ జాన్రా లో సాగే ఈ సినిమా కోసం ‘రాధ ప్రేమకథ’ అనే టైటిల్ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ అయిందని ఫిల్మ్ నగర్ వర్గీయులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు ఆనందపడుతున్నారు. తమ డార్లింగ్ మరో సారి లవ్ స్టోరీ తో వస్తున్నందుకు సంబరపడుతున్నారు. వర్షం సినిమా తరహాలో ఈ చిత్రం హిట్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.