సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ సినిమా 2023 ఆగస్టు 10న రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ వరుస ప్లాపులతో సతమతమవుతున్న టైంలో నెల్సన్ తో సినిమా ఓకే చేసుకున్నారు. అప్పటికి ‘బీస్ట్’ వంటి ప్లాప్ ఇచ్చాడు నెల్సన్. దీంతో రజనీకాంత్ అభిమానులు అతనితో సినిమా వద్దు అంటూ గోల చేశారు. అయినప్పటికీ రజినీకాంత్.. నెల్సన్ ను బలంగా నమ్మారు. నెల్సన్.. రజినీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
Jailer2
‘జైలర్’ లో రజినీకాంత్ రిటైర్ అయిపోయిన జైలర్ పాత్రలో చాలా హుందాగా కనిపిస్తారు.రజినీకాంత్.. ఏజ్ కి ఇమేజ్ కి బాగా సెట్ అయ్యింది ఆ కథ. దీంతో ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్..ల క్యామియోలు కూడా హైలెట్ అయ్యాయి. ‘జైలర్ 2’ అనేది ‘జైలర్’ కి ప్రీక్వెల్ కాబట్టి.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్..ల పాత్రలు కూడా ఉండాలి.
అది పక్కన పెడితే.. ‘జైలర్’ రిలీజ్ టైంలో ‘మలయాళం నుండి మోహన్ లాల్, కన్నడం నుండి శివరాజ్ కుమార్ ని తీసుకున్నప్పుడు టాలీవుడ్ నుండి ఏ హీరోని తీసుకోకపోవడం ఏంటి?’ అంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే దీనికి దర్శకుడు నెల్సన్ ‘సునీల్ ని తీసుకున్నాం కదా’ అంటూ సమాధానం ఇచ్చాడు. అది తెలుగు ప్రేక్షకులకి కోపం తెప్పించింది.
అందుకే ‘జైలర్ 2’ కోసం ఇద్దరు టాలీవుడ్ హీరోలని తీసుకోబోతున్నాడు నెల్సన్ అని టాక్. ఒక స్టార్ బాలకృష్ణ. దీనిపై నెల్సన్ ఇదివరకే హింట్ ఇచ్చాడు. ‘మరో హీరో ఎవరా?’ అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. దానికి సమాధానంగా జగపతి బాబు, శ్రీకాంత్..ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది.