తెలుగు సినీ పరిశ్రమలో కోలీవుడ్ మాస్ డైరెక్టర్ల హవా పెరుగుతోంది. ఇటీవల బాలీవుడ్ లో ‘జవాన్’తో (Jawan) భారీ విజయం అందుకున్న అట్లీ (Atlee Kumar), ‘జైలర్’తో (Jailer) సెన్సేషనల్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar), ‘విక్రమ్’(Vikram), ‘లియో’(LEO) వంటి మాస్ సినిమాలతో దూసుకెళ్తున్న లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) .. ఇప్పుడీ ముగ్గురు దర్శకుల ఫోకస్ టాలీవుడ్ స్టార్ హీరోల మీదే ఉంది. అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) తో భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడు.
మొదట సల్మాన్ ఖాన్ తో (Salman Khan) సినిమా అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దీంతో అట్లీ మళ్లీ సౌత్ వైపు రూట్ మార్చాడు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, బన్నీ తన నెక్స్ట్ మూవీగా ఇదే ప్లాన్ చేసుకున్నట్టు టాక్. మొదట త్రివిక్రమ్ (Trivikram) సినిమా ఉండాల్సినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ వేచి చూసే అవకాశాలున్నాయి. ఇక ఎన్టీఆర్ (Jr NTR) – నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ కూడా సెట్ అయ్యేలా ఉంది.
‘జైలర్’ ద్వారా మాస్, కామెడీ మిక్స్ చేసి రికార్డులు క్రియేట్ చేసిన నెల్సన్, ఎన్టీఆర్‌తో కూడా అదే తరహా హై ఓల్టేజ్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడట. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎన్టీఆర్ ఎనర్జీని వాడుకునేలా స్క్రిప్ట్ తయారవుతోందని సమాచారం. లోకేశ్ కనగరాజ్ – ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ మాత్రం అందరికీ సర్‌ప్రైజ్. లోకేశ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్‌లో తనదైన ముద్ర వేసిన డైరెక్టర్.
ఇప్పుడు ప్రభాస్ కోసం ఓ డార్క్ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇది మాస్ ఆడియన్స్‌కి పక్కా ఫీస్ట్ కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి, తెలుగు స్టార్ హీరోలు – కోలీవుడ్ మాస్ డైరెక్టర్లు కాంబినేషన్ టాలీవుడ్‌లో కొత్త హైప్ క్రియేట్ చేస్తోంది. బన్నీ-అట్లీ, ఎన్టీఆర్-నెల్సన్, ప్రభాస్-లోకేశ్.. ఈ ప్రాజెక్టుల్లో ఏది ముందుగా సెట్స్ పైకి వెళ్లి ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.