పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో వర్షం కూడా ఒకటి.. దివంగత దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా త్రిష హీరోయిన్‌గా నటించింది. ఇక టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. ప్రకాష్ రాజ్, సునీల్, రఘుబాబు వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు. ఇక టాలీవుడ్ దిగ్గజ నిర్మాత ఎం. ఎస్. రాజు నిర్మించిన ఈ సినిమా 2004 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌ను స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం వర్షం.. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే మూడో సినిమాగా వచ్చింది. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకులు ముందుకు వచ్చి నిర్మాతలకు మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్- త్రిష కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. గోపీచంద్ విలనిజం కూడా సినిమాను మరో లెవల్ కు తీసుకుపోయింది..
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఇదే సమయంలో చాలామందికి తెలియని అసలు విషయం ఏమిటంటే.. వర్షం సినిమాకి మొదటి ఛాయిస్ ప్రభాస్ కాదట.. ముందుగా దర్శకుడు శోభన్ ఈ సినిమా కథను టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో కోసం రాసుకున్నారట. అదే సమయంలో ఆ హీరో ఈ సినిమాకి నో చెప్పడంతో.. తర్వాత ఇదే స్టోరీ తో ప్రభాస్ వద్దకు వెళ్లగా ఇక అతనికి స్టోరీ నచ్చడంతో సినిమా వచ్చింది.. అలానే ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే ఓ మెంబర్బుల్ హిట్‌గా మిగిలిపోయింది.
ఇక ఇంతకీ ఈ వర్షం (Varsham) సినిమాను రిజెక్ట్ చేసిన దురదృష్టవంతుడు ఎవరంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. అవును ఇది నిజమే.. దర్శకుడు శోభాన్ ఈ కథను మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని రాశాడు.. ముందుగా దర్శకుడు ఆయన వద్దకు వెళ్లగా మహేష్ ఈ స్టోరీ నాకు సెట్ అవదు అంటూ ఎంతో సున్నితంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే.. రీసెంట్గా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వర్షం సినిమాని రీ రిలీజ్ చేయగా కూడా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.