టాలీవుడ్ స్టార్ హీరోలైన బన్నీ, ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ లో సత్తా చాటడంతో పాటు ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. బాహుబలి సిరీస్, సాహో సక్సెస్ తో ప్రభాస్ 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పుష్ప ది రైజ్ సక్సెస్ తర్వాత బన్నీకి 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకుని 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను పొందాలని భావిస్తున్న హీరోల జాబితా ఎక్కువగానే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ లో సత్తా చాటితే తమ భవిష్యత్తు సినిమాలకు కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ జరగడం గ్యారంటీ అని నమ్ముతున్నారు. చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత రెమ్యునరేషన్ ను భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి.
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కాబట్టి ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ లేదు. మహేష్ బాబు రాజమౌళి సినిమాతో, పవన్ హరిహర వీరమల్లు సినిమాతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో స్టేటస్ ను అందుకుంటామని నమ్ముతున్నారు. విజయ్ దేవరకొండ, నాని, రవితేజ కూడా పాన్ ఇండియా సినిమాలతో మార్కెట్ ను పెంచుకోవాలని భావిస్తున్నారు. 2024 సంవత్సరం నాటికి చాలామంది టాలీవుడ్ స్టార్స్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
అయితే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు బాలీవుడ్ లో వరుసగా సక్సెస్ సాధిస్తే మాత్రమే పాన్ ఇండియా హీరోలుగా భారీ రెమ్యునరేషన్ తో కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్, బన్నీ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడంతో ఇతర స్టార్ హీరోలు సైతం బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించే పనిలో పడ్డారు. కొన్నేళ్ల క్రితం వరకు తెలుగులో 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోలు ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ స్థాయికి ఎదగడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.