నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘టక్ జగదీష్’ చిత్రం గతేడాది వినాయక చవితి కానుకగా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ అయ్యింది. అక్కడ మంచి వ్యూయర్ షిప్ నే సొంతం చేసుకుంది ఈ చిత్రం. దాంతో అమెజాన్ ప్రైమ్ వారు లాభాల బాట పట్టారు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం వారికి మంచి లాభాలనే అందించింది.
హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ రూపంలో వారికి ఇంట్రెస్ట్ లు కూడా రికవర్ అయిపోయింది. ఈ చిత్రానికి హిట్ టాక్ అయితే ఏమీ రాలేదు. ఓటిటిలో చూసిన జనాలు ఈ మూవీని కార్తీ ‘చినబాబు’, మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలతో పోల్చి ట్రోల్ చేశారు కొంతమంది నెటిజన్లు. అయితే టీవీల్లో టెలికాస్ట్ అయ్యాక.. అక్కడ మంచి టి.ఆర్.పి రేటింగ్ నే నమోదు చేసింది ‘టక్ జగదీష్’ చిత్రం. టీవీల్లో ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించారు.
అంతా బానే ఉంది.. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. రెండు సార్లు టీవీల్లో టెలికాస్ట్ అయ్యాక.. ఎవరైనా థియేటర్ కి వెళ్లి చూస్తారా? అది అసాధ్యం. అందుకని ఓ కొత్త స్కెచ్ వేశారు. ‘టక్ జగదీష్’ థియేట్రికల్ వెర్షన్ వేరేలా డిజైన్ చేయించారట. అదనంగా కొన్ని సన్నివేశాలు యాడ్ అవుతాయి.. అనవసరమైనవి డిలీట్ అవుతాయట. ఎంత చేసినా పాత సినిమా కోసం జనాలు పనిగట్టుకుని వెళ్ళే అవకాశం లేదు. నాని పుట్టినరోజు నాడు అంటే ఫిబ్రవరి 24న ‘టక్ జగదీష్’ థియేటర్లలోకి రానుందని సమాచారం.