2000 వ సంవత్సరం అంటే మిలీనియం ఆరంభంలోనే వెంకటేష్ ‘కలిసుందాం రా’ ఇండస్ట్రీ హిట్ అవ్వడం… చిరంజీవి ‘అన్నయ్య’ సూపర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ కు శుభారంభాన్ని ఇచ్చినట్టు అయ్యింది. ఆ రెండు సినిమాల బాక్సాఫీస్ లెక్కలు.. ఆ రోజుల్లోనే రూ.70 కోట్ల వరకు వెళ్లాయి. ఇక వాటి దెబ్బకి 4 వారాల పాటు ఇంకో సినిమా రిలీజ్ కాలేదు. అలాంటి టైంలో అంటే 2000 ఫిబ్రవరి 4న శ్రీకాంత్ (Srikanth), రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), బ్రహ్మానందం (Brahmanandam)..ల ‘క్షేమంగావెళ్ళి లాభంగా రండి’ (Kshemamga Velli Labhamga Randi) అనే సినిమా వచ్చింది. రాజా వన్నెం రెడ్డి (Raja Vannem Reddy) ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
Kshemamga Velli Labhamga Randi
‘ఎం.ఎల్.ఆర్ట్ మూవీస్’ బ్యానర్ పై ఎం.వి.లక్ష్మి (M. V. Lakshmi) ఈ చిత్రాన్ని నిర్మించారు. వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas) సంగీత దర్శకుడు. వాస్తవానికి ఈ సినిమాని ఆ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్రయత్నించారు. కానీ చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్(Venkatesh Daggubati), బాలకృష్ణ (Nandamuri Balakrishna) వంటి స్టార్ల సినిమాలతో పాటు మోహన్ బాబు సినిమా కూడా ఉండటం వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఇక నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘క్షేమంగావెళ్ళి లాభంగా రండి’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) తమిళంలో హిట్ అయిన ‘విరాలుకెట్టా వీక్కం’ అనే సినిమాకి రీమేక్ గా ‘క్షేమంగావెళ్ళి లాభంగా రండి’ (Kshemamga Velli Labhamga Randi) రీమేక్ అయ్యింది.
2) లివింగ్స్టన్ పాత్రని ఇక్కడ శ్రీకాంత్, వివేక్ పాత్రని రాజేంద్ర ప్రసాద్, వడివేలు పాత్రని బ్రహ్మానందం ఇక్కడ పోషించడం జరిగింది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. అక్కడ కుష్బూ పోషించిన పాత్రని ఇక్కడ రోజా (Roja Selvamani), కనక పాత్రని ప్రీతా విజయ్ కుమార్ (Preetha Vijayakumar)..లు పోషించడం జరిగింది.
3) వాస్తవానికి శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్..ల ప్లేస్లో ఇద్దరు పెద్ద హీరోలను ఎంపిక చేసుకోవాలని చూశారు. కానీ ఒరిజినల్లో ఇమేజ్ లేని హీరోలు చేయడంతో తెలుగులో పెద్ద హీరోలు ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు.
4) ఇక ఈ సినిమాకి కీలక పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్య కృష్ణ (Ramya Krishnan)..ల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతున్నప్పుడు ఈ పాత్రలని ప్రవేశపెట్టి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఒరిజినల్లో ఈ పాత్రలని నాజర్, ఊర్వశి..లు పోషించడం జరిగింది.
5) ‘క్షేమంగావెళ్ళి లాభంగారండి’ సినిమా రిలీజ్ కి ముందు ఎటువంటి అంచనాలు లేవు. అంతా ‘కలిసుందాం రా’ (Kalisundam Raa) మేనియాలో ఉన్నారు ప్రేక్షకులు. మొదటి వారం సినిమాకి ఓపెనింగ్స్ సో సోగానే ఉన్నాయి. కానీ రెండో వారం నుండి ఈ సినిమా బాగా పుంజుకుంది. 50 రోజుల వరకు హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడిపోయాయి థియేటర్లు అన్నీ.
6) కథగా చెప్పుకుంటే ‘క్షేమంగావెళ్ళి లాభంగారండి’ పెద్దగా ఏమీ ఉండదు. ముగ్గురు మెకానిక్..లు కుటుంబ బాధ్యతల్ని లెక్కచేయకుండా అల్లరి చిల్లరగా తిరగడం.. తర్వాత పిల్లలు ఉద్యోగాలు చేయడానికి రెడీ అవ్వడంతో, రాత్రికి రాత్రి లక్షలు సంపాదించేసి వాళ్ళని కట్టడి చేయాలని అనుకోవడం. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యమే ఈ సినిమా మిగిలిన కథ.
7) కానీ ఒరిజినల్ కంటే కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు ఎ.మోహన్. చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ (Godfather) తీసిన మోహన్ రాజా (Mohan Raja) తండ్రిగానే ఈ ఎ.మోహన్. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమా స్క్రిప్ట్ పై మోహన్ రాజా కూడా పనిచేశాడు.
8) ఈ సినిమాకి హైలెట్స్ గురించి చెప్పుకోవాలి అంటే బ్రహ్మానందం, కోవై సరళ (Kovai Sarala)...ల కామెడీ ట్రాక్ అని చెప్పాలి. వీళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. రిపీట్స్ లో కొంతమందిని థియేటర్లకు వచ్చేలా చేశాయి.
9) ఈ సినిమాలో రవితేజ (Ravi Teja) కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. స్మగ్లర్ గా ఇతను కనిపిస్తాడు. ఇతని డైలాగ్ డెలివరీ కూడా ఇందులో బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్ లో హీరోని ఆడుకుంటున్నట్టు వచ్చి ఇరికించే సీన్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.
10) మొత్తంగా ‘క్షేమంగావెళ్ళి లాభంగారండి’ చిత్రం 70 కేంద్రాల్లో 50 రోజులు, 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. అలాగే అప్పటి రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల షేర్ ను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు వచ్చే కామెడీ సినిమాల కంటే వంద రెట్లు ఇందులో కామెడీ ఉంటుంది. ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie) వంటి సినిమాలు కూడా జుజుబీ అనిపిస్తాయి.