సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) , మంజు వారియర్ (Manju Warrier) జంటగా నటించిన ‘వేట్టయన్’ (Vettaiyan) సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ‘జైలర్’ (Jailer) రేంజ్లో హల్ చల్ చేయలేకపోయింది. తమిళంలో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ వచ్చినా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కి దగ్గర వరకు వెళ్లి ఆగిపోయింది.
‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.9.52 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.48 కోట్ల దూరంలో ఆగిపోయి జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ప్రమోషన్స్ కనుక గట్టిగా చేసుంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు రాబట్టేది.