సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేష్ తన గ్రాఫ్ తగ్గకుండా స్టడీగా వెళుతున్నారు. వీరి జెనరేషన్ లో చిరంజీవి మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ, సోలో హిట్స్ అందుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక నాగార్జున, బాలయ్య పరిస్థితి ఏమి బాగోలేదు. వీరిద్దరు ట్రెండ్ ని ఫాలో అవకుండా మూస ధోరణిలో వెళ్లడమే ఇందుకు కారణం. వెంకీ మాత్రం ఎప్పటికప్పుడూ అప్డేట్ అవుతూ వయసుకు దగ్గ పాత్రలు, మల్టీస్టారర్ లు చేస్తూ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నారు.
కాగా వెంకీ త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడని తెలుస్తుంది. దర్శకుడు తేజతో ఆయన ఓ వెబ్ సిరీస్ చేయనున్నాడట. ఈ విషయంపై కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే హీరో శ్రీకాంత్, జగపతి బాబు, నవదీప్ వంటి అనేక మంది నటులు డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. కొన్ని పరిశ్రమలలో ఈ ట్రెండ్ ఇప్పటికే మొదలైపోయింది. హాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో నటిస్తున్నారు.
కాగా వెంకటేష్ కూడా మెంటల్ గా ఫిక్సయ్యారని వినికిడి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ట్రెండ్ ఫాలో అవ్వాలి, డిజిటల్ ఎంట్రీకి ఎప్పుడూ సిద్దమే అని వెంకటేష్ చెప్పారు. కాబట్టి త్వరలోనే వెంకీ డిజిటల్ ఎంట్రీ పై అధికారిక ప్రకటన వచ్చే సూచనలు కలవు. మరి ఇదే కనుక జరిగితే టాలీవుడ్ నుండి ఓ టి టి లో ఎంటర్ అయిన మొదటి స్టార్ హీరో వెంకీనే అవుతాడు. ఇక ప్రస్తుతం వెంకటేష్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో నారప్ప సినిమా చేస్తున్నాడు. ఇది తమిళ హిట్ మూవీ మూవీ అసురన్ కి తెలుగు రీమేక్.