విజయ్ దేవరకొండకి టాలీవుడ్‌లో మాత్రమే కాదు, బాలీవుడ్‌లో కూడా భీభత్సమైన క్రేజ్ నెలకొంది. అక్కడి స్టార్లు మొత్తం విజయ్ దేవరకొండ మోస్ట్ వాంటెడ్ అని చెబుతుంటారు. అందుకే అతని కెరీర్ ప్రారంభించిన 5 ఏళ్ళకే పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో నటించే అవకాశాన్ని సంపాదించుకున్నాడు.విజయ్ దేవరకొండ అంటే కేవలం యాక్టర్ మాత్రమే కాదు.. ఓ బ్రాండ్ అన్నట్టు అతను దూసుకెళ్ళిపోతున్నాడు. మెల్లమెల్లగా అతను బిజినెస్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
‘రౌడీ’ బ్రాండ్ దుస్తుల్ని ఓ రేంజ్లో ప్రమోట్ చేసిన విజయ్.. అటు తర్వాత ‘ఆహా’ ఓటిటి కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించాడు. అంతేకాకుండా రెండు సినిమాల్ని కూడా ప్రొడ్యూస్ చేసి మంచి లాభాల్ని పొందాడు. ‘మీకు మాత్రమే చెబుతా’,’పుష్పక విమానం’ వంటి చిత్రాలు థియేటర్లలో హిట్ అవ్వకపోయినా.. వాటికి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘లైగర్’ కు కూడా ఓ బిజినెస్ మెన్ లానే వ్యహరిస్తున్నాడు అని వినికిడి.
విషయంలోకి వెళితే.. ‘లైగర్’ చిత్రానికి ఈ ‘అర్జున్ రెడ్డి’ నటుడు ఏకంగా రూ. 20 కోట్లు పారితోషికం మరియు లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్నాడట. బాలీవుడ్లో విజయ్ సినిమాకి మంచి క్రేజ్ ఉంది.. ఓటిటి డీలే ఏకంగా రూ.150 కోట్లు పలికింది. కరణ్ జోహార్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి.. ‘లైగర్’ పై అంత క్రేజ్ నెలకొంది. ఇక ఈ చిత్రం కనుక హిట్ అయితే విజయ్.. సుకుమార్ తో చేయబోతున్న చిత్రానికి మరింత పారితోషికం డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు.