విజయ్ దేవరకొండ… రీసెంట్ టైమ్‌లో మంచి విజయాలు అందుకున్న స్ట్రెయిట్ హీరోల్లో ఆయనొకరు. సినిమాలు అందుకున్న విజయాలు, ఆయన యాటిట్యూడ్ ఈ స్థాయిలో నిలబెట్టాయి. అయితే ఇప్పుడు మేం చెప్పే సినిమాలు కూడా చేసి ఉంటే.. ఇంకా పెద్ద స్థాయిలో ఉండేవాడు అని చెప్పొచ్చు. పదేళ్ల కెరీర్‌లో విజయ్ మంచి సినిమాలు చేశాడు, అయితే ఇప్పుడు మేం చెప్పబోయే సినిమాలు ఇంకా మంచివి అని మీరే అంటారు. ఆ లిస్ట్ తెలుసుకునే ముందు విజయ్ కెరీర్‌ను క్లుప్తంగా చూస్తే…
చిన్న చిన్న పాత్రలతో విజయ్ కెరీర్ ప్రారంభమైంది ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో కాస్త గుర్తింపుa ఉన్న పాత్ర చేశాడు. ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో స్టార్ హీరో ఇమేజ్‌వైపు అడుగులు వేశాడు. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ అంటూ మంచి సినిమాలే చేశాడు. అయితే ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత సరైన సినిమాలు ఓకే చేయలేకపోయాడు. దీంతో కెరీర్ కాస్త కుదుపులకు లోనైంది. ‘డియర్ కామ్రేడ్’ సినిమా తెలుగు, తమిళంలో విడుదల చేశారు.
నిజానికి ఈ సినిమాను హిందీలో రీమేక్ చేద్దాం అనుకున్నారు. కానీ సౌత్‌లో సినిమా పోయిన సరికి అక్కడ చేయలేదు. అయితే ఆ సినిమాకు బాలీవుడ్‌లో మంచి ఫలితం వచ్చేది అనే టాక్ కూడా ఉంది. ఇక ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కూడా తొలుత విజయ్ దగ్గరకే వచ్చింది. కానీ ముందుకెళ్లలేదు. అప్పటికే నటించిన సినిమాలో మళ్లీ ఎందుకు అని అనుకున్నాడని టాక్.
వరుస పరాజయాలతో ఉన్న నితిన్‌కు ‘భీష్మ’తో మంచి బూస్టింగ్ వచ్చింది. దర్శకుడు వెంకీ కుడుముల తొలుత విజయ్‌కు వినిపించారట. కానీ ఇమేజ్ సూట్ కాదేమో అని వదిలేశాడట. అలాగే ‘ఇస్మార్ట్ శంకర్’ను కూడా విజయ్ వదులుకున్నాడని ఓ టాక్. అందుకే ఆ తర్వాత ‘లైగర్’తో వస్తే ఓకే అన్నాడట. కానీ లాభం లేకపోయింది. దీంతోపాటు కొరటాల శివ కూడా ఓ కథ చెప్పగా నో అన్నాడట. మరోవైపు కార్తికేయను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ‘ఆర్‌ఎక్స్ 100’ కూడా విజయ్ దగ్గరకు తొలుత వచ్చిందట.
వైష్ణవ్ తేజ్‌ను లాంచ్ చేసిన ‘ఉప్పెన’ సినిమా కథ కూడా ముందు విజయ్ దేవరకొండకే చెప్పారట దర్శకుడు బుచ్చిబాబు సానా. అయితే విజయ్ దగ్గరకు పూర్తి కథ వెళ్లలేదు కానీ ఓ పాయింట్‌గా వెళ్లిందట. ఇక ‘హీరో’ అనే సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. ఆఖరిగా ‘లైగర్’ సినిమా షూటింగ్ కారణంగా ‘సీతారామం’ కూడా వదులుకున్నాడట (Vijay) విజయ్. వీటిలో ఎన్ని విజయాలు ఉన్నాయో మీకూ తెలుసు.