మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) అనే సోసియో ఫాంటసీ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘భోళా శంకర్’ ఫ్లాప్ అవ్వడం వల్ల.. ‘విశ్వంభర’ (Bhola Shankar) కచ్చితంగా హిట్ అయ్యి ఫీస్ట్ ఇస్తుంది అని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం కొంత ప్యాచ్ వర్క్ అలాగే వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ నడుస్తుంది.
జూన్ నెలాఖరుకు ఫస్ట్ కాపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెంటనే ప్రమోషన్స్ మొదలుపెడతారు. జూలై 24న ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘విశ్వంభర’ చిత్రం ప్రమోషనల్ ప్లాన్ ను కూడా ఫ్యామిలీ ఆడియన్స్, కిడ్స్ కి చేరువయ్యేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. అవును కథ ప్రకారం.. ఇందులో 6 లోకాలు ఉంటాయట. ఆయా లోకాల్లో విచిత్రమైన రాక్షసులు ఉంటారట.
ఓ పెద్ద రాక్షసుడు కింద మిగిలిన 5 మంది రాక్షసులు ఉంటారని తెలుస్తుంది. అక్కడ వింతైన జంతువులు ఉంటాయట. ఈ లోకాల్ని అందంగా డిజైన్ చేసారని అంటున్నారు. ముఖ్యంగా 5 మంది రాక్షసులతో చిరు చేసే ఫైట్ కీలక సందర్భంలో వస్తుందట. అది ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటుంది అని సమాచారం. సినిమాలో వావ్ ఫాక్టర్స్ ఇవే అని అంటున్నారు. ఇక త్రిష (Trisha) ఈ సినిమాలో చిరుకి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.