మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం రిలీజ్ అయ్యి నెల రోజులు కావస్తున్నా ఇంకా రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వకపోవడంతో.. ఈ వీకెండ్ కు కూడా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. ఇక అసలు మేటర్ లోకి వెళ్తే.. వైజాగ్ లో ఉన్న జగదాంబ థియేటర్ చాలా ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లో ఐకానిక్ సింగిల్ స్క్రీన్ లలో ఇది కూడా ఒకటి.
ఇప్పటి వరకు ఆ థియేటర్లో ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ రూ.1.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే నిన్నటి ఆదివారం కలెక్షన్స్ తో ‘వాల్తేరు వీరయ్య’ ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్స్ ను అధిగమించి రూ.1.14 కోట్ల కలెక్షన్స్ సాధించి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి సినిమానే చిరు సినిమా బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన ‘వాల్తేరు వీరయ్య’ 6 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి.. ఇప్పటివరకు రూ.225 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు నిర్మించారు. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషించడం జరిగింది.