సరిగ్గా నెల రోజుల క్రితం బాహాటంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 టీయార్పీ పరంగా బాగానే సాగుతున్నప్పటికీ.. మునుపటి సీజన్స్ తరహాలో ఎంటర్ టైన్ చేయలేకపోతుంది. టాస్క్ లు, గేమ్స్ అన్నీ కంటెస్టెంట్స్ కొట్టుకు సచ్చేలా ఉన్నాయే కానీ.. ఆడియన్స్ ను అలరించేలా లేకపోవడం గమనార్హం. ఇవన్నీ సరిపోవన్నట్లు.. నామినేషన్స్ ప్రక్రియ వచ్చినప్పుడల్లా ఎవడెందుకు అరుస్తున్నాడో తెలియక ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే ఓపెనింగ్ ఎపిసోడ్ కి వచ్చిన టీయార్పీలో సగం కూడా రెగ్యులర్ ఎపిసోడ్స్ కి ఉండడం లేదు.
నిజానికి నాలుగో సీజన్ పరిస్థితి కూడా ఇదే కానీ.. ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది అనే టైమ్ లో ఎవరో ఒక మంచి హీరోయిన్ లేదా ఆర్టిస్ట్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్ లోకి పంపి ఇంట్రెస్ట్ పెంచేవారు. ఈ సీజన్ 5 మొదలై.. నాలుగు వారాలవుతున్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది జరగలేదు. నిన్న నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తో కలిపి మొత్తం నలుగురు ఎగ్జిట్ అయ్యారు. అయినా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది జరగలేదు.
ఇప్పుడు హౌజ్ లో పార్టీసిపెంట్స్ దాదాపుగా యూట్యూబర్స్ అవ్వడం వల్ల ఆడియన్స్ కి పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. సొ, బిగ్ బాస్ టీం అర్జెంట్ గా మంచి హాట్ బ్యూటీని లేదా కాంట్రవర్సీయల్ పర్సనాలిటీని హౌజ్ లోకి వదిలితే కానీ మజా వచ్చేలా లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇద్దరిముగ్గురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. కన్ఫర్మేషన్ మాత్రం లేదు. మరి బిగ్ బాస్ ప్లాన్ ఏమిటో చూడాలి.