‘కంగువ’ (Kanguva) సినిమా కొట్టిన దెబ్బ నుండి తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తొందరగానే కోలుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన దారుణ ఫలితంతో కొత్త సినిమాలకు బాగా టైమ్ తీసుకుంటాడేమో అని అనుకుంటే.. వెంటనే స్టార్ట్ చేసేసి షాక్ ఇచ్చాడు. మరోవైపు కొత్త సినిమాలు వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ఇంకొన్ని కథలు కూడా వింటున్నాడు. దీంతో సూర్య నెక్స్ట్‌ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. దీనికి కారణం రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా.. ఇంకో రెండు చర్చల దశలో ఉన్నాయి.
సూర్య ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraj) దర్శకత్వంలో ‘రెట్రో’ (Retro) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఆర్‌జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే సూర్య ఇటీవల కథలు వినడం స్టార్ట్ చేశారట. అందులో భాగంగా ఇద్దరు తెలుగు దర్శకులు ఆయనకు కథలు చెప్పారని సమాచారం. త్వరలో సూర్య ఓ నిర్ణయం తీసుకొని చెబుతా అని అన్నారట.
ఆర్జే బాలాజీ సినిమాకు ఎక్కువ సమయం పట్టదని, అందుకే సూర్య కొత్త కథలు వింటున్నారు అని అంటున్నారు. ఆ కథలు చెప్పినవారిలో వెంకీ అట్లూరి (Venky Atluri) ఒకరు కాగా, చందు మొండేటి (Chandoo Mondeti) కూడా ఉన్నారు అని సమాచారం. నిజానికి వెంకీ అట్లూరి విషయం పాతదే. సూర్యకు ఆయన ‘మారుతి’ అనే కథ చెప్పారట. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మారుతి కారును కథా వస్తువుగా ఎంచుకున్నారట వెంకీ.
ఆ కారు మన దేశానికి ఎలా వచ్చింది? దాని నేపథ్యం ఏమిటి? అనే అంశాలతో కథ రాసుకున్నారట. ఇక చందు మొండేటి అయితే 300 ఏళ్ల వెనుక జరిగిన కథను సినిమాగా చెప్పారట. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తుంది అయితే ఈ ఇద్దరిలో ఎవరికి సూర్య (Suriya) ఓకే చెబుతారు అనేది చూడాలి.