Vijay Deverakonda: వెయ్యి కోట్లు తెచ్చాక.. విజయ్‌తో సినిమా… ఇది సాధ్యమేనా మాస్టారూ ?
- October 14, 2024 / 09:56 AM ISTByFilmy Focus
నాలుగేళ్ల క్రితం అనుకుంటాం.. విజయ్ (Vijay Devarakonda) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అంటూ ఓ సినిమా అనౌన్స్ అయింది. ఏమైందో ఏమో కానీ నెలలు గడుస్తున్నాయి, కేలండర్‌లు మారుతున్నాయి. కానీ ఇప్పటివరకు సినిమా మొదలుకాలేదు. ఆగిపోయిందా అంటే.. లేదు లేదు సినిమా ఉంది అని విజయ్ అంటుంటాడు. అతని టీమ్ కూడా అదే చెబుతూ ఉంటుంది. చాలా మంది హీరోల సినిమాల విషయంలో క్లారిటీ వస్తోంది కానీ.. ఈ సినిమా విషయంలో రావడం లేదు.
Vijay Deverakonda

‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేయడంతో.. సుకుమార్ కొత్త సినిమాల లైనప్ మీద అందరి దృష్టి పడింది. పక్కాగా నెక్స్ట్ రామ్‌చరణ్ (Ram Charan) సినిమా ప్రారంభిస్తారు. ఆ తర్వాత ‘పుష్ప 3’ అంటున్నారు. అయితే ఇక్కడ డౌట్ అసలు సుకుమార్ విజయ్‌తో సినిమా చేసే పరిస్థితి ఉందా అని. ఎందుకంటే ‘పుష్ప: ది రూల్’తో సుకుమార్ రూ. వెయ్యి కోట్ల డైరక్టర్ అవుతారు అని పక్కాగా నమ్ముతున్నారు జనాలు.

మరి అంత భారీ సినిమా ఇచ్చి విజయ్‌తో చిన్నగా ఓ సినిమా చేస్తాడా? అని. పోనీ విజయ్‌తో ఆ స్థాయి సినిమా చేద్దాం అంటే మార్కెట్ లేదు. కాబట్టి విజయ్ – ఫాల్కన్ క్రియేషన్స్ – సుకుమార్ సినిమా ఉందా? లేదా? అలా అని విజయ్ ఏమన్నా తక్కువనా అంటే సరైన కంటెంట్ పడితే అదిరిపోయే సినిమా ఇవ్వగలడు. గతంలో ఇది చేసి చూపించాడు కూడా. అయితే సెలక్షన్‌లో కనెక్షన్ మిస్ అవుతున్నాయి.

చూద్దాం ఈ సినిమా మెటీరియలైజ్ ఎందుకు అవ్వడం లేదు.. ఎప్పుడు ఉండొచ్చు అనే విషయంలో విజయ్ దేవరకొండ టీమ్ నుండి ఏమైనా స్టేట్‌మెంట్ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే విజయ్ – గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలంక నేపథ్యంలో సాగే ఈ సినిమా పోస్టర్ ఇటీవల విడుదలైన మంచి స్పందనను సంపాదించింది. త్వరలో ప్రచారం షురూ చేస్తారట.












