ఓ దర్శకుడు కలల ప్రాజెక్ట్‌ను రాయడం, ఒప్పిండచం, పట్టాలెక్కించడం, విడుదల చేయడం.. అంత ఈజీగా కాదు. ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటిని దాటితేనే సినిమా థియేటర్లలోకి వస్తుంది. అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నరు పూరి జగన్నాథ్. తన కలల సినిమా ‘జనగణమన’ను అలా ఎన్నో కష్టాలు పడి ఇటీవల స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమా అనుకున్నట్లుగా కొనసాగుతుందా? రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందా? తన కలల ప్రాజెక్ట్ ‘జన గణ మన’ అంటూ పూరి జగన్నాథ్ చాలా ఏళ్లుగా చెబుతూ వస్తున్నారు.
తొలి రోజుల్లో పవన్ కల్యాణ్‌తో ఈ కథ అనుకున్నారు. ఆ తర్వాత మహేష్‌బాబుతో అన్నారు. చాలావరకు ఓకే అయిపోయింది అనుకున్నప్పుడు పూరి అవుటాఫ్ ఫామ్ అయిపోయింది ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కూడా ఈ సినిమా అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. కానీ కుదర్లేదు. ఆఖరికి ఈ సినిమాకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడు. దీంతో కొన్ని నెలల క్రితం భారీ స్థాయిలో అనౌన్స్ చేశారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మళ్లీ మారిపోయింది. పూరి జగన్నాథ్ మళ్లీ అవుటాఫ్ ఫామ్ అనిపించుకున్నారు.
కారణం ‘లైగర్’ ఫలితమే. ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ‘జన గణ మన’ అలియాస్ ‘జేజీఎం’ ఉంటుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. దీనికి సమాధానం చెప్పడం ప్రస్తుతానికి పూరి జగన్నాథ్‌కి కానీ, ఛార్మికి కానీ, విజయ్ దేవరకొండకి కానీ కష్టమే. ఎందుకంటే ‘లైగర్’ కొట్టిన దెబ్బ నుండి కోలుకోవడానికి చాలా రోజలు పడుతుంది అని చెబుతున్నారు టాలీవుడ్ పరిశీలకులు. ‘జేజీఎం’ను పూరి జగన్నాథ్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. అప్పుడే షూటింగ్ ప్రారంభించి ఉంటే బాగుండేది. ఈపాటి కాస్త అయినా సినిమా అయ్యేది కాబట్టి సినిమా కొనసాగించాలి అనే పరిస్థితి ఉండేది.
కానీ విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా పనుల్లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ‘లైగర్’ ప్రమోషన్స్‌లో ఉండిపోయాడు. దీంతో ఇప్పుడు ‘జేజీఎం’ను ఆపేయడానికి పెద్ద ఇబ్బంది లేదు. అయితే ఇబ్బందల్లా పూరి జగన్నాథ్‌కే. ఇప్పటికిప్పుడు పూరితో సినిమాకు ఎవరూ ముందుకు రారు. చిరంజీవితో ‘ఆటో జానీ’ బయటకు తీద్దాం అనుకున్నారు. బాలీవుడ్‌లో ఖాన్‌లతో, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌లతో సినిమాలు అనుకున్నారు పూరి. ‘బిజినెస్ మేన్’, ‘పోకిరి’ సీక్వెల్స్ కూడా అనుకున్నారు. కానీ అవన్నీ ‘లైగర్’ హిట్ అయ్యుంటే జరిగేవి. సో ‘జేజీఎం’ మాత్రమే కాదు.. చాలా ప్రాజెక్టులకు క్రాస్ బ్రీడ్ దెబ్బేసింది అన్నమాట.