ఎన్టీఆర్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దానికి ‘డ్రాగన్’ టైటిల్ ప్రచారంలో ఉంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఇంతలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) అనే టైటిల్ తో తమిళంలో ఓ సినిమా రూపొందింది. ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కూడా తెలుగులో ‘మైత్రి’ సంస్థ రిలీజ్ చేయడం జరిగింది.
ఇది వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్..ల సినిమాకి టైటిల్ మారుస్తారా? అనే డౌట్స్ ఆడియన్స్ లో ఏర్పడ్డాయి. దానికి నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు జరిగిన ప్రెస్మీట్లో.. ”డ్రాగన్’ అనే టైటిల్ ను తమిళంలో ఈ సినిమా కోసం వాడేశారు. మరి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ గారి సినిమాని ఇదే టైటిల్ తో రిలీజ్ చేస్తారా లేక వేరే టైటిల్ తో రిలీజ్ చేస్తారా?’ అంటూ ఓ రిపోర్టర్ మైత్రి రవి శంకర్ ని ప్రశ్నించడం జరిగింది.
దానికి అతను స్పందిస్తూ.. ” అలా ఏమీ ఉండదండి. అది హై వోల్టేజ్ యాక్షన్ తో కూడిన డ్రాగన్. దీనికి దానికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అలా అని ఈ సినిమాని తక్కువ చేయడం కాదు. దీని కాన్సెప్ట్ కి ఇది ఎక్స్ట్రార్డినరీ టైటిల్. అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ‘డ్రాగన్’ అనే టైటిల్ హిట్ అవ్వడం కూడా ఆనందంగా ఉంది. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన సినిమా. అది వచ్చి ఇంటర్నేషనల్ వైడ్ బాక్సాఫీస్ ను చుట్టేస్తోంది” అంటూ చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ డ్రాగన్ టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చిన రవిశంకర్!#Dragon #JrNTR #PrashanthNeel #NTRNeel pic.twitter.com/qHRig1Wnrj
— Filmy Focus (@FilmyFocus) March 3, 2025