2023 మార్చి 13 ప్రపంచ సినీ చరిత్రలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు గర్వంతో తల పైకెత్తేలా చేసిన రోజు.. ఏళ్ల తరబడి నెలకొన్న నిరీక్షణకు తెర పడిన రోజు.. టాలీవుడ్‌కి ప్రపంచ సినీ దిగ్గజం హాలీవుడ్ సలాం కొట్టిన రోజు.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ గెలుచుకున్న రోజు.. కొద్ది రోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ టీం.. దర్శకుడు రాజమౌళి,
సంగీత దర్శకుడు కీరవాణి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీస్‌తో సహా ఆస్కార్ సాధించడమే లక్ష్యంగా లాస్ ఏంజెల్స్‌లో ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. మధ్యలో చరణ్ – తారక్ హైదరాబాద్ వచ్చి వెళ్లారు కానీ జక్కన్న, కార్తికేయ అక్కడే ఉండిపోయి అన్ని పనులూ చక్కబెట్టారు.. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది.. తెలుగు సినిమాకి కలగానే మిగిలిపోయిన అకాడమీ అవార్డు ‘నాటు నాటు’ పాటతో సాకారమైంది..
ఇక హీరోలు రామ్ – భీమ్ కూడా అక్కడి మీడియాతో, అభిమానులతో, సినీ ప్రముఖులతో ఇంటరాక్ట్ అయ్యారు.. పలు టీవీ షోలలోనూ పాల్గొన్నారు.. వారిచేత ఎంత వరకు చేయించాలో అంత ప్రమెషనూ చేయించారు.. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో అకాడమీ అవార్డ్ తెలుగు సినిమాని వరించింది.. దేశం పక్కన పెట్టినా కానీ పర్సనల్‌గా తన సినిమాను తానే ప్రమోట్ చేసుకుని ఆస్కారి బరిలో నిలిపి గెలిచి చూపించారు జక్కన్న.. తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది.. ఆస్కార్ సాధించింది రాజమౌళి వల్లనే..
ఆస్కార్స్‌లో పర్సనల్ ఎంట్రీకి డోర్స్ ఓపెన్ చేశారాయన.. తర్వాత ‘పుష్ప : ది రూల్’ వంతే అంటున్నారు ఇండస్ట్రీ వారు.. ‘పుష్ప : ది రైజ్’ ని హిందీలో రిలీజ్ చేయాలా వద్దా అని మేకర్స్ సందేహిస్తుంటే ధైర్యంగా చెయ్యమని చెప్పింది జక్కన్నే.. ఆ సినిమా నార్త్‌లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ఆస్కార్ ఎంట్రీకి కావాలసిన అన్ని అంశాలు.. అర్హతలు ‘పుష్ప 2’ లో ఉన్నాయి.. సరిగ్గా ప్రమోట్ చేస్తే అవార్డ్ గెలవచ్చంటున్నారు సినీ వర్గాల వారు.. మరి పార్ట్ 1 విషయంలో సాయం చేసిన దర్శకధీరుడు పార్ట్ 2కి కూడా సాయమందిస్తారా?.. చూడాలి..
ఆస్కార్ ఎంట్రీకి కావల్సిన బేసిక్ క్వాలిటీస్..
1) సినిమా బడ్జెట్ మినిమం 70+ కోట్లు ఉండాలి..
2) సినిమాను ప్రమోట్ చేయడానికి బెస్ట్ పీఆర్ టీమ్ ఉండాలి..
3) మూవీలో మినిమమ్ గ్యారంటీ అయిన అన్ని అంశాలు ఉండాలి..