ఏదైనా ఒక భాషలో చేసిన ఒక పర్టిక్యులర్ జోనర్ ఫెయిల్ అయ్యిందంటే.. ఆ తరహా జోనర్ లో మళ్ళీ సినిమా తీయాలంటే దర్శకనిర్మాతలు భయపడతారు. కానీ.. మలయాళంలో ఫెయిల్ అయిన ఒక జోనర్ ను ట్రై చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా “సోలో” అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దుల్కర్ నాలుగు పాత్రల్లో నటించాడు. నాలుగు విభిన్నమైన కథలను తెరపై ప్రెజంట్ చేశారు. ఈ కాన్సెప్ట్ & కంటెంట్ కు మలయాళ జనాల్లో పెద్ద రెస్పాన్స్ రాలేదు కానీ.. క్రిటిక్స్ మాత్రం బాగానే మెచ్చుకొన్నారు.
ఇప్పుడు ఇదే తరహా కాన్సెప్ట్ తో “వరల్డ్ ఫేమస్ లవర్” ఉండబోతోందని తెలుస్తోంది. క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని నాలుగు పోస్టర్స్ ను విడుదల చేసాగా.. నలుగురు హీరోయిన్స్ తో నాలుగు డిఫరెంట్ గెటప్స్ తో దర్శనమిచ్చాడు విజయ్. ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్స్ అనుకొన్నారు.. కానీ నాలుగు కథలు, నాలుగు జీవితాల కలయికగా ఆంథాలజీగా “వరల్డ్ ఫేమస్ లవర్” తెరకెక్కుతోందని తెలుస్తోంది. మరి ఈ ప్రయోగం తెలుగులో ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.